
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. యుద్ధంలో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌కు చెందిన ‘టెహ్రాన్ టైమ్స్’ తొలి పేజీ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇరాన్‌లోని మినాబ్‌లో ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 165 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

ఆ చిన్నారుల ఫొటోలను టెహ్రాన్ టైమ్స్ తొలి పేజీలో ప్రచురించింది. ‘‘ట్రంప్.. వారి కళ్లల్లోకి చూడు’’ అంటూ హెడ్ లైన్ పెట్టింది. వందల సంఖ్యలో చిన్నారులు మరణిస్తే మినాబ్ ఎలిమెంటరీ స్కూల్‌పై జరిగిన దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండిస్తున్నారంటూ పేర్కొంది.

అగ్రరాజ్యం క్షిపణి దాడిలో విద్యార్థులు మరణించారని ఇరాన్ పేర్కొంటుండగా, ట్రంప్ మాత్రం ఆ నెపాన్ని టెహ్రాన్‌పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్ ఆయుధాలకు కచ్చితత్వం ఉండదంటూ, మినాబ్ పాఠశాల దాడి ఘటనకు ఆ దేశానిదే బాధ్యతంటూ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు యుద్ధంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు చిన్నారుల ఫొటోలతో ‘టెహ్రాన్ టైమ్స్’ తొలిపేజీ ఆ పసివాళ్ల కళ్లల్లోకి చూడు ట్రంప్
Follow for more updates.
