అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రమాణస్వీకారం…

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం మొదలైంది. సీనియర్ నేత అయిన కరుప్పయ్య ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వతిస్తూ ముందుగా సీఎం విజయ్‎తో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 234 ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు.

శాసనసభ్యుల చేత ప్రొటెం స్పీకర్‎గా ఎన్నికైన కరుప్పయ్య ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో ముఖ్యమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటీవలే జరిగిన తమిళనాడు ఎన్నికల్లో TVK 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

కాంగ్రెస్, VCK CPI, CPM, IMUL మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి దశాబ్దాల DMK, AIDMK అధిపత్యానికి తెరదించింది. నిన్న చెన్నైలోని నెహ్రు ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ముఖ్యమంత్రిగా విజయ్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణం చేయగా.. ఇవాళ ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.

Follow for more updates.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top