పీక్స్ కి చేరిన ‘పెద్ది’ క్రేజ్.. | Peddi Movie Craze | Ram Charan | Janhvi Kapoor

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఈవెంట్ సోమవారం బెంగళూరులో భలేగా సాగింది… దాంతో కన్నడసీమలోనూ ‘పెద్ది’పై బజ్ క్రియేట్ అయింది…

Peddi Movie Update

అంతకు ముందు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోనూ ‘పెద్ది’ ప్రచార కార్యక్రమం ఘనంగా జరిగింది… ఆ ఫంక్షన్ తో ఉత్తరాదిన సైతం ‘పెద్ది’ సినిమాకు ఓ స్పెషల్ బజ్ క్రియేట్ అయిందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు… హిందీలో ‘పెద్ది’ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని నార్త్ ఇండియా మూవీ లవర్స్ కూడా ఆశిస్తున్నారు… ఒకవేళ ‘పెద్ది’ సినిమా కేవలం హిందీ వర్షన్ తో ఓ వంద కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఓ రికార్డ్ లభిస్తుందని అంటున్నారు… ఇప్పటి దాకా ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ లో ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ యన్టీఆర్ ఉన్నారు…

రామ్ చరణ్ కు కూడా హిందీ వర్షన్ తో మాత్రమే నూరు కోట్లు వసూలు చేసిన సినిమాగా ‘ట్రిపుల్ ఆర్’ ఉంది… అయితే ప్రభాస్, బన్నీ, తారక్ – ముగ్గురూ రెండేసి చిత్రాలతో ఉన్నారు… ‘పెద్ది’ కూడా హిందీ వర్షన్ తో వంద కోట్లు పోగేస్తే వారి చెంతన చెర్రీ కూడా చేరిపోతారు…

ఓ తెలుగు స్టార్ హిందీ వర్షన్ మూవీతోనూ వంద కోట్ల వసూళ్ళు చూడడం అన్నది ప్రభాస్ ‘బాహుబలి-ద బిగినింగ్’తోనే మొదలయింది… ఆ తరువాత అదే ఊపును ప్రభాస్ తన “బాహుబలి-ద కంక్లూజన్, సాహో, సలార్, కల్కి 2898 ఏడి” చిత్రాలతోనూ కొనసాగించారు… అలా హిందీ వర్షన్ తోనూ వంద కోట్లకు పైగా వసూళ్ళు చూసిన సౌత్ హీరోస్ లో ప్రభాస్ దే అగ్రస్థానం… ఆ తరువాత ‘పుష్ఫ’ సిరీస్ తో అల్లు అర్జున్ కూడా రెండు సార్లు హిందీ వర్షన్ తో వంద కోట్లు పోగేశారు…

జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్‌ కలసి నటించిన ‘ట్రిపుల్ ఆర్’ సైతం హిందీ డబ్బింగ్ తో వంద కోట్లకు పైగా వసూలు చేసింది… యన్టీఆర్ తన ‘దేవర’తోనూ హిందీలో అదే ఫీటు సాధించడంతో ఆయన కూడా హిందీలో వంద కోట్లు చూసిన రెండు సినిమాలను సంపాదించినట్టయింది… ప్రస్తుతానికి చెర్రీకి ‘ట్రిపుల్ ఆర్’ ఒక్కటే హిందీ వర్షన్ లో వంద కోట్ల సినిమా ఉంది… ‘పెద్ది’ కూడా నూరు కోట్ల మార్కు దాటిందంటే చెర్రీకి కూడా వంద కోట్ల చిత్రాలు రెండు చేరతాయి… ఓ సౌత్ మూవీ ఉత్తరాదిన అనువాద రూపంలో వంద కోట్లు సాధించడమంటే మాటలు కాదు… అలాంటి ఫీట్ ను మన ప్రభాస్, జూనియర్ యన్టీఆర్, అల్లు అర్జున్ సాధించేశారు… సోలో హీరోగా రామ్ చరణ్ ‘పెద్ది’తో ఆ తీరున సాగుతారని అందరూ ఆశిస్తున్నారు… సౌత్ ఇండియన్ స్టార్స్ – హిందీ వర్షన్ మూవీస్ తో ఆ ఫీట్ సాధించడం లో ప్రభాస్ దే పైచేయి…

ఆయన ఐదు చిత్రాలతో అగ్రగామిగా నిలిచారు… రజనీకాంత్ ‘2.0’, యశ్ ‘కేజీఎఫ్-2’, రిషబ్ శెట్టి ‘కాంతార- చాప్టర్1’ చిత్రాలు సైతం హిందీ వర్షన్ తో వంద కోట్లు చూసిన సినిమాలుగా ఉన్నాయి… అయితే వీరికంటే మిన్నగా మన ప్రభాస్, బన్నీ, తారక్ రెండేసి చిత్రాలతో ఉన్నారు… మరి చెర్రీ ఈ క్లబ్ లో చేరడానికి ఎంత సమయం తీసుకుంటారో చూడాలి…

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top