Iran – Israel War: ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ ఇతనే..! ట్రంప్ సంచలన ప్రకటన..

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. పరస్పర దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ తోపాటు.. గల్ఫ్ దేశాల్లో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం అనంతరం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.. ఇరాన్ సుప్రీం లీడర్ గా 36 ఏళ్ల పాటు పదవిలో ఉన్న ఖమేనీ.. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. పరస్పర దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ తోపాటు.. గల్ఫ్ దేశాల్లో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం అనంతరం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.. ఇరాన్ సుప్రీం లీడర్ గా 36 ఏళ్ల పాటు పదవిలో ఉన్న ఖమేనీ.. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన భార్య, కూతురు, అల్లుడు, మనవడు .. చాలా మంది చనిపోయారు. ఈ క్రమంలోనే.. ఇరాన్‌ కొత్త సుప్రీంలీడర్‌గా మొజ్తబా ఖమేనీ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. తదుపరి సుప్రీం లీడర్ గా మొజ్తబా ఖమేనీని ఇరాన్‌ అసెంబ్లీ ఎన్నుకున్నట్లు ఇజ్రాయెలీ మీడియా కథనాలు ప్రచురించింది. ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబాకే ఇరాన్‌ సారధ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా చేసిన‌ దాడుల్లో అయతుల్లా ఖమేనీ చనిపోయారు. ఆ తర్వాత కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా పేరు తెరపైకి వచ్చింది.

మొజ్తబా పేరును సుప్రీం లీడర్‌ పదవికి ఖరారు చేయలని ఇరాన్‌ సైన్యంలోని సీనియర్‌ అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వారి ఒత్తిడి మేరకు ఖమేనీ రెండో కుమారుడికి పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది. మొజ్తబా ఖమేనీని సుప్రీం లీడర్‌గా అధికారికంగా ఎన్నుకున్నట్లు ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు ప్రచురించింది. మొజ్తబా X ఖాతాలో సుప్రీం లీడర్‌ అంటూ పేరు ప్రకటించారు. కాగా.. ఇరాన్‌, ఇజ్రాయెల్ యుద్ధం ఐదోరోజు తీవ్రరూపం దాల్చింది. ఇరాన్‌పై పెద్దఎత్తున విరుచుకుపడుతోన్న అమెరికా-ఇజ్రాయెల్‌.. ఇరాన్‌లోని 2000 లక్ష్యాలను దెబ్బతీసినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ సైతం ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. సౌదీ అరేబియాలోని CIA స్టేషన్‌, ఖతార్‌లోని US బేస్‌పై దాడులు చేసింది.

అమెరికాకి సాటి లేదు: డొనాల్డ్ ట్రంప్..

ఇరాన్‌ చమురు సరఫరాకు ఇబ్బందులు కలిగిస్తుండటంపై ట్రంప్‌ చర్యలు తీసుకున్నారు. అమెరికా DFC డెవలప్‌ మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కి ట్రంప్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు. మ్యారీటైమ్‌ ట్రేడ్‌కి పొలిటికల్‌ రిస్క్‌, గ్యారంటీ ఇన్సూరెన్స్‌ కల్పించాలని ట్రంప్‌ సూచించారు. ముఖ్యంగా గల్ఫ్‌ ప్రాంతం నుంచి సరఫరా అయ్యే ఇంధన రంగ ఉత్పత్తులకు ఇన్సూరెన్స్‌ కల్పించాలన్నారు. అన్ని షిప్పింగ్ కంపెనీలకు గ్యారంటీ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలన్న ట్రంప్‌.. అవసరైతే అమెరికన్‌ నేవీ చమురు సరఫరా చేసే నౌకలకు రక్షణ కల్పిస్తుందన్నారు. హర్మూజ్‌ జలసంధి నుంచి సాఫీగా చమురు సరఫరా అయ్యేలా చూస్తామని ట్రంప్‌ ప్రకటించారు. ఆర్థిక, మిలిటరీ సామర్థ్యంలో అమెరికాకి సాటి లేదని.. త్వరలో అమెరికా మరిన్ని చర్యలు తీసుకుంటుందని ట్రంప్‌ పేర్కొన్నారు.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top