అర్ధరాత్రి దాడితో కలకలం.. పులివెందులలో హై అలర్ట్!
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, పులివెందుల నియోజకవర్గంలోని ఎర్రిపల్లిలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ బూత్ల వద్ద జరిగిన గొడవల్లో భాగంగా పెట్రోల్ బాంబులతో దాడులు చేసినట్లు సమాచారం. ఈ ఘటనలతో అక్కడ భారీ మంటలు చెలరేగి, ఎన్నికల ప్రక్రియలో తీవ్ర భయాందోళనలు ఏర్పడ్డాయి.
పెట్రోల్ బాంబులతో ఒక్కసారిగా కలకలం.. పులివెందులలో ఏం జరిగింది?
పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలతో పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివెందుల మండలంలోని ఆర్. తుమ్మలపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది.
ఏపీలో ‘పరిషత్’ పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. తొలుత పోలింగ్ కేంద్రం వద్దకు భారీగా వైకాపా కార్యకర్తలు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో సమీపంలో పెట్రోల్ బాంబులు వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
అదే జిల్లా నందలూరులోనూ ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రౌడీలు అక్కడికి వచ్చారు. దీంతో స్థానికులు వారి వాహనాలను అడ్డుకున్నారు. రౌడీలను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లిలో ఘర్షణ జరిగింది. వైకాపా మాజీ ఎమ్మెల్యే జోగారావు సొంత గ్రామంలో ఆ పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగడంతో తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు వైకాపా నేతలు యత్నించగా.. తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. విజయనగరం జిల్లా గరివిడి పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా, జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరుపార్టీల నేతలు పరస్పరం నెట్టుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో జనసేన నాయకురాలిపై వైకాపా నేత దాడికి పాల్పడ్డాడు. పోలింగ్ బూత్ వద్ద వైకాపా జడ్పీటీసీ అభ్యర్థి బొత్స పూజిత ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
