కానిస్టేబుల్ ప్రాణం తీసిన లోన్ యాప్..
ఆన్లైన్ లోన్ యాప్‌ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అప్పు తీసుకున్న వారిని టార్గెట్ చేస్తూ నిర్వాహకులు చేస్తున్న వేధింపులు ప్రాణాలు తీస్తున్నాయి.తాజాగా హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.మృతుడిని శ్రీను (32)గా గుర్తించారు. కొండాపూర్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీను.. సుమారు నాలుగు నెలల క్రితం ఓ ఆన్లైన్ లోన్ యాప్‌లో రూ.40 వేల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించలేకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.అప్పు చెల్లించాలంటూ ప్రతి గంటకు ఫోన్ కాల్స్ చేస్తూ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా శ్రీను భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా తయారుచేసి కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు పంపిస్తామని బెదిరించినట్లు సమాచారం.ఈ వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శ్రీను.. చివరకు తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఓ పోలీస్ కానిస్టేబుల్‌నే లోన్ యాప్ వేధింపులు బలితీసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో మరోసారి ఆన్లైన్ లోన్ యాప్‌ల అక్రమాలపై చర్చ మొదలైంది.అప్పు ఇచ్చి వేధింపులకు గురిచేస్తున్న లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
