మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చని తెలిపారు. ప్రజాధనాన్ని దోచేసిన వ్యక్తి ఎందుకు పార్టీ పెడుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో ఏ2గా విజయసాయిరెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. జగన్, విజయసాయిరెడ్డిలు ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని దోచేశారని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు.
ప్రజాధనం కాబట్టి ఇద్దరూ ప్రజలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ క్రైంలు చేయడంలో పార్టనర్స్ అని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో అక్రమ మద్యంతో 30వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అనేకమంది అనారోగ్యం పాలయ్యారని.. వీటన్నింటిపైన జగన్, విజయసాయిరెడ్డిలు సమాధానం చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
