చిల్లర గొడవలో కండక్టర్ మృతి.. ప్రాణం తీసిన ప్యాసింజర్!
గత పది రోజులు క్రితం చిల్లర విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ ప్రయాణికురాలు మహిళా కండక్టర్‌ను బస్సులోంచి తోసేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ తాజాగా మరణించింది.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిల్లర విషయంలో జరిగిన వివాదంలో ప్రయాణికురాలు బస్సులో నుంచి తోసేయడంతో తీవ్రంగా గాయపడిన మహిళా ఆర్టీసీ కండక్టర్ గుండ్ల ప్రవళిక చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదన కలిగించింది.
Watch Here for full Story : https://youtu.be/Q8uE5NM_czI
అసలేం జరిగింది?
అక్టోబర్ 25న మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక విధుల్లో ఉండగా, మిట్టగూడెం సమీపంలో ఓ ప్రయాణికురాలితో చిల్లర విషయంలో వివాదం తలెత్తింది. ప్రయాణికురాలు తన కుమారుడి టికెట్ కోసం రూ.100 ఇవ్వగా, టికెట్ జారీ చేసిన కండక్టర్ మిగతా చిల్లరను తర్వాత ఇస్తానని తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 25న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సులో ప్రవళిక అనే కండక్టర్ విధుల్లో ఉండగా.. మౌనిక అనే ప్రయాణికురాలు చిల్లర విషయంలో ఆమెతో గొడవ పెట్టుకుంది.. మౌనిక తన కుమారుడుకి టికెట్ కోసం రూ.100 ఇవ్వగా.. కండక్టర్ ఆమెకు టికెట్ ఇచ్చి మిగతా చిల్లర తర్వాత ఇస్తానని చెప్పింది.
కానీ మౌనిక మాత్రం తనకు వెంటనే చిల్లర ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వాగ్వాదంకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఒకరినొకరు నెట్టుకోవడంతో కండక్టర్‌ను బస్సులోంచి జారీ పడిపోయింది. దీంతో ఆమె కాళ్లపై నుంచి బస్సు వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ ప్రవళికను హాస్పిటల్‌కు తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేసిన తండ్రి నాగరాజు మృతి చెందడంతో వారసత్వంగా పది నెలల క్రితం ప్రవళికకు కండక్టర్ ఉద్యోగం వచ్చింది. త్వరలోనే ఆమెకు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలోనే ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవళిక మరణంతో మణుగూరులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు మణుగూరు బందుకు పిలుపునిచ్చాయి. విధులు బహిష్కరించి డిపో ఎదుట ఆందోళన చేపట్టారు.
ఇదిలా ఉండగా మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రవళిక మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రవళిక కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటాయి అన్నారు. ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ప్రవళిక కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
