నా భర్తను నాకు తెచ్చివ్వండి!.. 10 నెలల బాబుతో భార్య నిరసన
విశాఖపట్నానికి చెందిన ఐదుగురు యువకులు రష్యా ఆర్మీలో చిక్కుకున్నారు. తమను కాపాడి ఏపీకి తీసుకువెళ్లాలి అంటూ సెల్ఫీ వీడియోలో వేడుకున్నారు. ఉపాధి కోసం రష్యా వెళ్లిన కొంతమంది యువకులను ఓ నేపాల్ వ్యక్తి ఆర్మీలో ఫుడ్ ప్యాకేజింగ్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నమ్మబలికాడు.
నాకు నా భర్త కావాలి.. బిడ్డతో అత్తింటి ఎదుట భార్య ఆవేదన!
తీరా ఆర్మీలో చేరిన తర్వాత తమను రష్యా-ఉక్రెయిన్ బార్డర్లో యుద్ధంలోకి పంపిస్తున్నారని వారు ఒక సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాకు తిరిగి వెళ్లిపోతామంటే, అక్కడి అధికారులు “మీకు అక్కడ సిటిజన్ షిప్ లేదు, మీరు రష్యన్స్” అని చెబుతున్నారని వాపోయారు. తమకు భారతదేశ సిటిజన్ సిప్ కావాలని, రష్యన్ భాషలో ఉన్న పేపర్లపై తమతో సంతకాలు చేయించుకున్నారని పేర్కొన్నారు. తాము యుద్ధభూమిలో ఉన్నామని, ఇదే తమకు చివరిరోజు కావచ్చని చెబుతూ, దయచేసి ప్రధాని మోడీ తమ ప్రాణాలను కాపాడి ఏపీకి వచ్చేలా సహాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకున్నారు.
Watch Full Story : https://youtu.be/uRm9gqCN9lE
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు భర్త కోసం భార్య పోరాటం!
ఇండియన్ గవర్నమెంట్ తలుచుకుంటే తమను వెనక్కి తీసుకురావచ్చని, వారి పరిస్థితిని, దుస్థితిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో.. వారు పంపిన వీడియోను అందరూ పంచుకుంటున్నారు.
10 నెలల బాబుతో న్యాయపోరాటం.. భర్తను తన వద్దకు పంపాలని వేడుకోలు
అయితే ఈ మధ్య కాలంలో ఉపాధి పేరుతో భారతీయ యువకులను రష్యా సైన్యంలోకి పంపించిన ఏజెంట్ల మోసాల గురించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పలు యూట్యూబ్ ఛానెళ్లు, స్థానిక ట్రావెల్ ఏజెంట్లు రష్యాలో సెక్యూరిటీ గార్డులు, ఆర్మీలో హెల్పర్లు, డెలివరీ బాయ్స్ వంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని, లక్షల్లో జీతం ఉంటుందని నిరుద్యోగ యువకులను ఆకర్షించి మోసం చేసిన ఘటనలు బయటకొచ్చాయి. ఉద్యోగం పేరుతో నమ్మించి తీరా రష్యా చేరుకున్న తర్వాత వారి పాస్‌పోర్టులను లాక్కుని, రష్యన్ భాషలో ఉన్న డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకుని రష్యా-ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్‌లోకి దించారనే వార్తలు వచ్చాయి.
