కొవ్వూరు దగ్గర భారీ రైలు ప్రమాదం.. ఆగిపోయిన వందే భారత్!
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో నాలుగో లైన్‌పై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలులో 8 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సీపట్నం, తుని, అన్నవరం, నిడదవోలు, రాజమండ్రి స్టేషన్లలో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. కొవ్వూరు స్టేషన్లో రెండో ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన వందేభారత్ రైలు నిలిచిపోయింది. అంతేకాకుండా, విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి.
Watch Full Video : https://youtu.be/pn9ocDnSNs4
విశాఖ-విజయవాడ రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీనిపై సమాచారం అందిన వెంటనే రైల్వే శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాక్‌పై నుంచి పట్టాలు తప్పిన గూడ్స్ రైలును తొలగించి.. రైళ్ల రాకపోకలను పునరుద్దరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఫెర్టిలైజర్స్ లోడుతో ఒడిశా నుంచి మహారాష్ట్రకు ఈ గూడ్స్ రైలు వెళ్తుంది.

ఈ రైలులోని 8 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ మార్గంలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామర్లకోటలో విశాఖపట్నం నుంచి వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు. అలాగే హౌరా నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును కూడా సామర్లకోటలో నిలిపి ఉంచారు.
విశాఖ, విజయవాడ ప్రధాన రైల్వే మార్గంలో రైళ్లు దాదాపు 8 గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో వైపు వరుస సెలవులు.. రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయకచవితి వచ్చాయి. దీంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు శుక్రవారం జనం సొంత ఊరు బాట పట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు అన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
Follow for more updates.