ఆర్మీ యూనిట్లో ఆయుధాలు మాయమవడంతో కలకలం.. అసలు ఏం జరిగింది?
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆయుధాల చోరీకి గురికావడం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 11 రోజులు తర్వాత ఈ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ప్రాంగణం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి పాల్పడిన కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒక మాజీ సైనిక అధికారి కూడా తెలుస్తోంది. ఆ అధికారి కేవలం రెండు నెలల క్రితమే పదవీ విరమణ చేసినట్టుగా తెలుస్తోంది.
ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు
అలాగే, అతనికి సహకరించిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లాలో దొంగిలించిన ఆయుధాలలో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు స్వాధీనం చేసుకున్న తుపాకులు, మందుగుండు సామగ్రి, ఇతర వస్తువులను మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారంలో చోరీకి గురైన వాటి జాబితాతో సరిపోల్చనున్నారు.
సికింద్రాబాద్ ఆర్మీ క్యాంపులో భద్రతపై ప్రశ్నలు.. చోరీ వెనుక ఎవరు?
అయితే ఈ వ్యవహారం చాలా సున్నితమైనది కావడంతో పోలీసులు, ఆర్మీ అధికారులు అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ప్రాంగణం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ చెప్పారు. బొల్లారం పోలీస్ స్టేషన్లో నమోదైన ఆయుధాల దొంగతనం కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులు జరగలేదని చెప్పారు.
ఇదిలాఉంటే, ఆగస్టు 31వ తేదీ మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం తాళాలు పగలగొట్టి ఉండటాన్ని సైనిక సిబ్బంది గుర్తించడంతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. గల్లంతైన వస్తువులలో ఐదు అసాల్ట్ రైఫిళ్లు, ఏడు పిస్టళ్లు, 21 మ్యాగజైన్లు, రూ. 15 లక్షల విలువైన మందుగుండు సామగ్రి ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆర్మీ అధికారులు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బొల్లారం పోలీసులు కేస నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, విధుల్లో ఉన్న సిబ్బందిని ప్రశ్నిస్తూ, ఆయుధాగారం చుట్టూ ఉన్న భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేస్తున్నారు.
తెలంగాణ కౌంటర్-ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్, మల్కాజిగిరి పోలీసులు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, ఎన్ఐఏ, ఇతర కేంద్ర ఏజెన్సీలతో సహా పలు సంస్థలు కూడా ఈ దర్యాప్తులో పాల్గొంటున్నాయి. అయితే ఈ దర్యాప్తు కొనసాగుతుండగానే ఆయుధాల చోరీ జరిగిన మద్రాస్ రెజిమెంట్ ప్రహరీ సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు దొరకడం కలకలం రేపింది. రెజిమెంట్ సమీపంలోని ప్రైవేట్ వెంచర్‌కు అనుకుని ఉన్న ఫైరింగ్ రేంజ్ గోడ సమీపంలో వీటిని గుర్తించారు. వీటిని అధికారులు స్వాధీనం చేసుకుని, ఇందుకు సంబంధించి కూడా దర్యాప్తు జరుపుతున్నారు.
Follow for more updates