కేసీఆర్ ముందే పొట్టు పొట్టు..! అసలు కథేంటి?
- దామరకుంట రణరంగం
- ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్‌హౌస్
- కాంగ్రెస్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి
- గజ్వేల్ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఘర్షణ
- కేటీఆర్ హరీష్ రావు ఎర్రవల్లి
- ఎర్రవల్లి 144 సెక్షన్
- సిద్దిపేట జిల్లా ఉద్రిక్తత
- తెలంగాణ రాజకీయ వార్తలు
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెరిగిన హీట్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట దగ్గర రణరంగంగా మారింది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కాంగ్రెస్ కాన్వాయ్‌పై బీఆర్ఎస్ రాళ్ల దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని దామరకుంట వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
BRSలో జరుగుతున్న పరిణామాలేంటి?
ఇరు పార్టీల కార్యకర్తలు ముఖాముఖి ఎదురు పడటంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల వాహనాలపైకి విచక్షణారహితంగా రాళ్ల దాడికి దిగడంతో పరిస్థితి రణరంగంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో పలు వాహనాలు ధ్వంసమై స్థానికంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. తీవ్ర ఘర్షణలతో ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో దామరకుంట పరిసరాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
కేటీఆర్, హరీష్‌రావు పాత్రపై చర్చ
మరోవైపు ఈ ఉద్రిక్తతల సమాచారం అందుకున్న BRS నేతలు కేటీఆర్, హరీష్ రావులు అసెంబ్లీ సమావేశాల నుంచి నేరుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయల్దేరారు. అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాలపై కేసీఆర్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు BRS ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. అలాగే, ఇకపై సభలో వ్యవహరించాల్సిన తీరుపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఫాంహౌస్ చుట్టుపక్కల పరిస్థితి విషమించకుండా నివారించేందుకు పోలీసులు ముందస్తుగా 144 సెక్షన్ విధించారు. వెంకటాపూర్, ఎర్రవల్లి శివారు ప్రాంతాల్లో భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను తీవ్రంగా నిర్బంధించారు. నిరసనకారులను ఫాంహౌస్ వైపు రాకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటూ బందోబస్తును కట్టుదిట్టం చేశారు.
మరన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
