యూట్యూబర్ నందన అరెస్ట్.. అసలు ఏం జరిగింది?
- యూట్యూబర్ నందన అరెస్ట్
- నందుస్ వరల్డ్ నందన
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నందన అరెస్ట్
- యూకే ఉద్యోగాల మోసం నందన
- నందన విదేశీ ఉద్యోగాల స్కామ్
- ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కేస్
- తెలుగు యూట్యూబర్ అరెస్ట్
- విజయవాడ క్రైమ్ న్యూస్
హైదరాబాద్ ఎయిర్పోర్టులో నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
విదేశాల్లో ఉద్యోగాల పేరిట సామాన్యులను బురిడీ కొట్టించిన వ్యవహారంలో ప్రముఖ యూట్యూబర్ నందనకు ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. UKలో భారీ వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో ఆమెను శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
లండన్ ఉద్యోగాలు, వీసాల పేరుతో మోసం ఆరోపణలు
సోషల్ మీడియా వేదికగా గుర్తింపు సంపాదించుకున్న నందన, ఆమె భర్తతో కలిసి ‘నందుs వరల్డ్’ పేరిట చానల్ ప్రారంభించి వచ్చిన గుర్తింపుతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. UKలో ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేశారు. తీరా డబ్బులు చేతికి అందాక బాధితులకు మొండిచేయి చూపడంతో వ్యవహారం రచ్చకెక్కింది.
దీనిపై భారత్లోనే కాకుండా అటు UKలోనూ వీరిపై తీవ్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పటికే ఆమె లండన్లో తలదాచుకోవడంతో నిందితురాలిని స్వదేశానికి రప్పించేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
For Full Story Click here : https://youtu.be/Hn-G5bvRjN4
నందనపై Look-Out Circular ఎందుకు జారీ చేశారు?
దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న నందనను అధికారులు విమానాశ్రయం వెలుపలికి అడుగుపెట్టక ముందే ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శంషాబాద్ స్థానిక పోలీసుల సాయంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం ఎస్సై నేతృత్వంలోని బృందం ఆమెను కస్టడీలోకి తీసుకుంది. సుమారు పది గంటల పాటు పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ నందన విచారణకు ఏమాత్రం సహకరించకపోవడం, ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది
విమానాశ్రయ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చే సమయంలో మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, గుర్తుపట్టకుండా పూర్తిగా ముఖానికి ముసుగు వేసుకుని మీడియా కంట పడకుండా అత్యంత వేగంగా కారులోకి వెళ్ళిపోయింది. మరోవైపు నందన కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కావాలనే ఆమెపై నిరాధారమైన నిందలు మోపుతున్నారని, అసలు విచారణ పూర్తిగా ముగియక ముందే దోషిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. చట్టంపై తమకు పూర్తి గౌరవం ఉందని, పోలీసుల విచారణకు హాజరై వాస్తవాలు నిరూపిస్తామని వారు పేర్కొంటున్నారు.
