- కూకట్పల్లి ఫుడ్ సేఫ్టీ దాడులు
- ప్యారడైజ్ మెహఫిల్ దాడులు,
- హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ న్యూస్,
- కుళ్లిన మాంసం స్వాధీనం,
- TG SAFE దాడులు
హైదరాబాద్ నగరంలోని పేరుగాంచిన హోటళ్లలో డొల్లతనం బయటపడుతోంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసన్షియల్ డ్రగ్స్ అధికారులు కూకట్పల్లి ప్రాంతంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై దాడులు చేశారు.
10 బృందాలుగా ఏర్పడిన టీజీ సేఫ్ అధికారులు చేసిన దాడుల్లో ఆయా హోటళ్లు రెస్టారెంట్లు, మెస్‌లు, బేకరీలలోని కిచెన్లలో బొద్దింకలు, ఈగలు ఎలుకలు ఉన్నట్లు గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణం, రికార్డుల నిర్వహణ లేకపోవడం, సరైన నిల్వ విధానాలు అమలు చేయకపోవడం, నాణ్యత లేని ఉత్పత్తుల వినియోగం, చేస్తున్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాల శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపారు. భూలక్ష్మి మెస్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న 30 కిలోల మటన్, 20 కిలోల చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే, ఈ తనిఖీల్లో భాగంగా దాదూస్ మిఠాయి వాటిక, గుమ్మడి ఫుడ్స్, ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్, KS బేకర్స్, చైతన్య ఫుడ్ కోర్ట్, గోదావరి మిఠాయి, మణికంఠ లైవ్ స్పేస్ లగ్జరీ ఉమెన్స్ హాస్టల్, లక్ష్మీ వెంగమాంబ హాస్టల్, పద్మావతి డీలక్స్ మెస్, శ్రీ బాలాజీ లగ్జరీ మెన్స్ పీజీ హాస్టల్, కేఎస్ మెన్స్ పీజీ హాస్టల్, జీవీకే న్యూ లగ్జరీ పీజీ మెన్స్ హాస్టల్, హోటల్ సితార గ్రాండ్, మెహఫిల్ రెస్టారెంట్, శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్, బేక్ మ్యాక్స్ ఫుడ్స్, మండి కింగ్ అరేబియన్ రెస్టారెంట్, కూకట్పల్లి మండి, భూలక్ష్మి మెస్, శ్రీ హర్ష డీలక్స్ మెస్ సహా మొత్తం 20 యూనిట్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల సందర్భంగా కిచెన్లలో బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారం ఉండడాన్ని, అపరిశుభ్రతను అధికారులు గుర్తించారు. దీంతో ఐదు సంస్థల FSSAI లైసెన్సులను వెంటనే సస్పెండ్ చేశారు.
అలాగే, రూల్స్ బ్రేక్ చేసిన సంస్థలకు పెనాల్టీలు విధించేందుకు ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్, చైతన్య ఫుడ్ కోర్ట్, భూలక్ష్మి మెస్, గోదావరి మిఠాయిలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. తనిఖీల్లో వెల్లడైన లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశిస్తూ గుమ్మడి ఫుడ్స్ లోని శ్రీ మహాలక్ష్మి కేంద్ర, కేఎస్ బేకర్స్, లక్ష్మీ వెంగమాంబ హాస్టల్, పద్మావతి డీలక్స్ మెస్, మెహఫిల్ రెస్టారెంట్, శ్రీ హర్ష డీలక్స్ మెస్‌లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు అందించారు. వీటిని త్వరలోనే పున:పరిశీలించి నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ డ్రైవ్ లో కల్తీ అనుమానంతో 20 ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లకు పంపగా, పాడైపోయిన కూరగాయలతో పాటు పురుగులు పట్టిన పల్లీలు, పిండి పదార్థాలు, ఎండుమిర్చిని అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
