తలపై కత్తితో పొడిచి.. విశాఖ ఫిషింగ్ హార్బర్లో దారుణం!
- వైజాగ్ ఫిషింగ్ హార్బర్ హత్య.
- మైలపల్లి చంటి హత్య.
- విశాఖ క్రైమ్ న్యూస్
- వైజాగ్ మర్డర్ కేస్
- వన్ టౌన్ పోలీస్ విచారణ
- తెలుగు క్రైమ్ వార్తలు
- కోస్టల్ బ్యాటరీ బీచ్ హత్య
- విశాఖపట్నం వార్తలు
విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతుడు మైలపల్లి చంటిగా గుర్తించారు. ఫిషింగ్ హార్బర్ సమీప బీచ్‌లో చంటి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతుడు చంటి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని హతమార్చారా లేక వ్యక్తిగత వివాదం ఏదైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతదేహం లభ్యమైన ప్రదేశంలో నిందితుల ఆచూకి, సాక్షాల కోసం డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఆధారాలు దొరికిన తర్వాత ప్రకటిస్తామని పోలీసులు తెలిపారు.
Watch here for full story : https://youtu.be/b2Ycz-Ou_es
వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో మైలపల్లి చంటి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కోస్టల్ బ్యాటరీ ఎదురుగా సాగర తీరంలో చంటి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. హత్య ఎవరు చేశారు..? ఎందుకు చంపారూ అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తన సోదరుడు చంటిని నిన్నటి నుంచి చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నట్టుగా చెప్పాడని మృతుని సోదరి చెప్పింది.
చంటిని తలపై కర్రతో కొట్టి… మెడకు నైలాన్ తాడు చుట్టి ఉరివేసి చంపినట్లుగా గుర్తించారు పోలీసులు. చంటి విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చేపల వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. భార్య పిల్లలతో పెయిన్ దొర పేటలో నివాసం ఉంటున్నట్లుగా చంటి సోదరి తెలిపింది. చంటి సోదరి అప్పలకొండ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. చంటి హత్యకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేక వ్యక్తిగత గొడవలతో హత్య చేశారా అని ఆరా తీస్తున్నారు.
