నో చెప్పిందని కక్ష పెంచుకున్నాడా? మహిళ దారుణ హత్య
హైదరాబాద్: మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో కలిసి జీవించేందుకు నిరాకరించిందనే కారణంతో ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. మోతీనగర్లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన అంజలి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు అశ్విన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగింది? ఒక మహిళ ప్రాణాలను బలిగొన్న ఈ దాడికి దారితీసిన పరిస్థితులేంటి?
మహిళ హత్య వెనుక తిరస్కరణే కారణమా? పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్ మోతీనగర్ లో దారుణం చిటుచేసుకుంది. తనతో కలిసి జీవించేందుకు నిరాకరించిందనే కారణంతో అంజలి అనే మహిళపై అశ్విన్ దాడికి పాల్పడినట్లు సమాచారం. అరటిపండ్లు కోసేందుకు ఉపయోగించే కత్తితో అంజలిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన అంజలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ.. ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంజలి మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు అశ్విన్ను అదుపులోకి తీసుకున్నారు. దాడికి దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్క ‘నో’తో మారిన పరిస్థితులు.. మహిళ హత్య కేసులో కీలక విషయాలు
అయితే, అశ్విన్ తో కలిసి జీవించేందుకు అంజలి నిరాకరించిందని దాడికి పాల్పడటం.. చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇష్టం లేని సంబంధాన్ని తిరస్కరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే తప్ప.. దాడులతో సమాధానం చెప్పడం సరికాదు.
