సత్తా చాటిన బైరెడ్డి.. నందికొట్కూరులో వైసీపీ గ్రాండ్ విక్టరీ!
ఆంధ్రప్రదేశ్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది!రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి హవా కొనసాగుతున్న వేళ.. నంద్యాల జిల్లాలో వైసీపీ సంచలన విజయాన్ని నమోదు చేసింది.నందికొట్కూరు మున్సిపాలిటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.మొత్తం 32 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు సత్తా చాటారు.32 వార్డులకు గానూ వైసీపీ 23 వార్డుల్లో విజయం సాధించగా.. టీడీపీ కేవలం 9 వార్డులకే పరిమితమైంది.
రాష్ట్రంలో కూటమి హవా.. నందికొట్కూరులో బైరెడ్డి మ్యాజిక్!
ఇక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వైసీపీ నేత ఫాతిమా బీ భారీ విజయాన్ని అందుకున్నారు.ఏకంగా 4 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.దీంతో నందికొట్కూరు మున్సిపల్ పీఠం వైసీపీ కైవసం చేసుకుంది.
బైరెడ్డి వ్యూహం ఫలించిందా? నందికొట్కూరులో వైసీపీ ప్రభంజనం!
విజయం ఖరారు కావడంతో కౌంటింగ్ కేంద్రం వెలుపల వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.బాణాసంచా కాలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సవాలు జరుపుకున్నాయి.మొత్తానికి.
బైరెడ్డి సత్తా ఏంటో చూపించారు.. నందికొట్కూరులో 23 వార్డులు వైసీపీ ఖాతాలో!
మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. నందికొట్కూరులో వైసీపీ జెండా ఎగరడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.ఎనిమిది స్థానాల్లో YCP ఆధిపత్యం చెలాయిస్తోంది. ఒక స్థానంలో మాత్రం TDP ముందంజలో ఉంది.
