బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో పూర్తిగా విఫలం చెందింది. దీంతో రానున్న ఎన్నికల్లో లేబర్ పార్టీ 14 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తుందంటున్నారు. UK ప్రత్యర్థి పార్టీ మెజార్టీ సాధించడంతో ఇకపై కౌన్సిళ్లను లేబర్ పార్టీ కంట్రోల్ చేయబోతోంది. దశాబ్దాల తర్వాత ఫలితాలు పునరావృతం అయ్యాయి. బ్రిటన్ రాజకీయాలపై సమగ్ర సమాచారం మీకోసం..
మొత్తంగా ఫలితాలు ప్రధాన మంత్రి రిషి సునక్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈశాన్య ఇంగ్లాండ్ లోని టీస్ వ్యాలీకి కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మేయర్ గా బెన్ హౌచెన్ గెలుపొందడంతో ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. బ్రిటన్ లో కన్సర్వేటివ్ పార్టీ ఇంతగా ఎప్పుడూ ఓడిపోలేదని సర్వేలు చెబుతున్నాయి. లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మెర్ మాత్రం అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. వాయువ్య ఇంగ్లాండ్‌లోని బ్లాక్బర్న్, ఓల్డ్హామ్ వంటి ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో పాలస్తీనాలోని గాజా – ఇజ్రాయిల్ యుద్దంలో ఇజ్రాయిల్ కు అనుకూలంగా ఉండటంతో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థులు నష్టపోయారు. ఇంగ్లండ్ వాయువ్య ప్రాంతంలోని బ్లాక్పూల్ సౌత్ పార్లమెంటరీ స్థానాన్ని లేబర్ పార్టీ తిరిగి గెలుచుకుంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ బ్రెక్సిట్-మద్దతుగా ఉండటంతో ఈ సీటు కన్జర్వేటివ్ పార్టీకి దక్కింది.
లాబీయింగ్ కుంభకోణం కేసులో కన్జర్వేటివ్ శాసనసభ్యుడు రాజీనామా చేయడంతో లేబర్పార్టీకి చెందిన క్రిస్ వెబ్ 10,825 ఓట్లను సాధించాడు. ఇన్ని ఓట్ల ను సాధించడం అతిపెద్ద విజయం. దీంతో 2010 తర్వాత లేబర్ పార్టీ తిరిగి అధికారం సాధించే దిశలో ఉంది. 2024 లో రెండవ భాగంలో ఇంగ్లాండ్ ఎన్నికలు ఉంటాయని సునాక్ తెలిపారు. ఇంగ్లండ్‌లోని స్ట్రాత్‌క్లైడ్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జాన్ కర్టిస్ మాట్లాడుతూ, కన్జర్వేటివ్‌లు పోటీ చేస్తున్న సీట్లలో దాదాపు సగం ఓడిపోతున్నారన్నారు. 2,661 సీట్లలో సగానికి పైగా స్థానాలు లెక్కించారు. కన్జర్వేటివ్‌లు 410 కంటే ఎక్కువ సీట్లు కోల్పోగా, లేబర్ పార్టీకి 170 సీట్లు పెరిగాయి.. మధ్యేవాద లిబరల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ వంటి ఇతర పార్టీలు కూడా లాభపడ్డాయి.
లిజ్ ట్రస్ స్వల్పకాలిక పదవీకాలం తర్వాత అక్టోబర్ 2022లో సునాక్ ప్రధానమంత్రి అయ్యారు. మార్కెట్లు ఆర్థికంగా నష్టపోవడం, గృహయజమానులకు రుణాలు తీసుకునేందుకు కూడా నిధులు లేని పన్ను తగ్గింపుల బడ్జెట్ రూపొందించిన 49 రోజుల తర్వాత లిజ్ ట్రస్ తన పదవిని విడిచిపెట్టాడు. ఒపీనియన్ పోల్స్‌లో లేబర్ నిలకడగా 20 శాతం పాయింట్లతో ముందంజలో ఉండటంతో, సునక్ చేయడానికి ఏమీ లేదు. సునక్ కంటే మరెవరైనా మెరుగ్గా చేయగలరా అన్న విషయంపై కన్జర్వేటివ్ పార్టీ చర్చిస్తోంది.
Discussion about this post