పశూనాం పతిం పాపనాశం పరేశం
గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం |
జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం
మహాదేవమేకం స్మరామి స్మరామి
అంటే లోకంలో ఎన్ని పాపాలు చేసినా ఆశివుడు క్షమిస్తాడు అని అర్ధం. దేవదేవుడు వెలసిన దేవాలయం… శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం సురుటుపల్లి లో వెలసి ఉంది.దేశంలో శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో చాలా వరకూ శివుడు లింగ రూపంలో దర్శనం ఇవ్వగా. కొన్ని చోట్ల మాత్రం విగ్రహ రూపంలో విగ్రహం తో భక్తులకు దర్శనమిస్తాడు. తల్పశయ్య పైన శ్రీ రంగనాధ స్వామి వారు నిద్రిస్తున్నట్లుగా ఇక్కడ స్వామి వారు దర్శనమిస్తారు. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర ఏమిటి, స్థలపురాణO గురించి కనులారా వీక్షిద్దాం.
పశుపతి అంటే పశువులకు అధిపతి. అంటే సాక్షాత్తు పరమశివుడు. పాశం అంటే తాడు. దానితో కట్టబడి ఉన్నదాన్ని పశువు అంటారు.పశువులకు అధిపతి పశుపతి నాధుడు. అంటే శివుడు. మానవులకు దుక్కిదున్ని పంటలు పడించే పశువుని (ఎద్దు,నంది)ని వాహనంగా ధరించినవాడు. ఎన్నో నామాలు కలిగిన శివయ్య భక్తులు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. కొన్ని నీళ్ళతో అభిషేకం చేస్తే చాలు కోరిన కోరికలు తీర్చే భోళా శంకరుడు. భారత దేశ వ్యాప్తంగా శివయ్యకు ఎన్నో దేవాలయాలున్నాయి. ఒక్కో దేవాలయంలో ఒక్కోపేరుతో పూజలందుకుంటున్నాడు చంద్రశేఖరుడు. చంద్రవంకను శిగలో ధరించి చంద్రశేఖరుడు అయ్యాడు ఈశ్వరుడు. అటువంటి శివుడు ఎక్కువ శాతం దేవాలయాల్లో లింగాకారంలోనే దర్శమిస్తాడు. లింగాకారంలోనే అభిషేకాలు పొందుతాడు. అటువంటి శివుడు విగ్రహం రూపంలో కనిపించే ఆలయాలు బహు తక్కువగా ఉంటాయి.అటువంటి దేవాలయాల్లో పళ్లికొండేశ్వర దేవాలయం ఒకటి.
ఈ దేవాలయానికి ఉండే మరో అత్యంత అరుదైన,అద్భుతమైన ప్రత్యేకత మరొకటి ఉంది. ఈ దేవాలయంలో పార్వతీదేవి ఒడిలో పడుకుని దర్శమిస్తాడు శివుడు. పళ్లికొండేశ్వర దేవాలయం ప్రత్యేకత అదే. ఆలయంలోని గర్భగుడిలో.. పార్వతీ దేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న స్థితిలో శివుడి విగ్రహం కనిపిస్తుంది. ఆ తీరులో ఉన్న శివయ్యను..ఆ ఆదిశక్తిని అలా చూస్తుండిపోవాలనిపించే అత్యంత అద్భుతంగా దర్శమిస్తారు ఆదిదంపతులు..ఆ విగ్రహం కూడా కొర్చొని లేదా నిలబడిన రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు ఆ పరమేశ్వరుడు. ఆంధ్రప్రదేశ్ లోని పళ్లి కొండేశ్వర క్షేత్రంలో శివుడు పార్వతి ఒడిలో పడుకున్న రూపంలో కనిపిస్తాడు. దేశంలో ఇటువంటి విగ్రహం ఇదొక్కటే. ఈ క్షేత్రాన్ని సూరుటుపళ్లి అని కూడా అంటారు. చుట్టూ పచ్చని చెట్లు, సెలయేటి గలగల మధ్య ఈ క్షేత్ర దర్శనం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
Discussion about this post