సామాన్య రైతు బిడ్డ ప్రియాల్ యాదవ్ డిప్యూటీ కలెక్టర్ గా ఎంపిక అయ్యారు. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ MPPSC నిర్వహించిన పరీక్షలో ఆమె 6వ ర్యాంక్ తెచ్చుకున్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన ఆమె ప్రస్తుతం యువతకు స్ఫూర్తిదాయకంగా మారింది. వివరాలేమిటో తెలుసుకుందాం…
పదో క్లాసువరకు క్లాసు టాపర్ గా ఉన్నానని, బంధువుల ఒత్తిడితో ఎంపీసీ తీసుకోవడంతో ఫిజిక్స్ లో ఫెయిలయ్యానని ఎడ్యుకేషన్ లో అదే మొదటి , చివరి ఫెయిల్యూర్ అని ప్రియాల్ చెప్పారు. 2019లో జరిగిన MPPSC పరీక్షలో 19 వర్యాంకు వచ్చింది దాంతో జిల్లా రిజిస్ట్రార్ గా ఉన్నానన్నారు. 2020లో 34వ ర్యాంకు రావడంతో కోఆపరేటివ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఇండోర్ లో జిల్లా రిజిస్ట్రార్ గా ఉన్నారు. 2021లో జరిగిన MPPSC examination ఫలితాలు జూన్ మొదటి వారంలో వచ్చాయి. దానిలో ఆమె 6వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి సాధారణ రైతు కాగ, తల్లి ఇంటివద్దనే ఉంటారు.
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాలాంటి చాలా మందికి టీన్ ఏజ్ లోనే పెళ్లిళ్లు జరుపుతారు. అయితే మా తల్లీదండ్రులు నా పెళ్లిగురించి బలవంతం చేయలేదు. చదువుకుంటానికి చాలా స్వేచ్ఛ నిచ్చారని ప్రియాల్ చెప్పారు. ప్రస్తుతం ఆమె కలెక్టర్ కావాలన్న కలలను సాకారం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తూనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రిపేర్ అవుతానన్నారు. ప్రియాల్ తో సహా మరో 10 మంది టాప్ క్యాండిడేట్లు డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపిక అయ్యారని అధికారులు తెలిపారు.
2021లో 290 పోస్టుల కోసం MPPSC ప్రకటన విడుదల చేసింది. అదర్ బాక్ వర్డ్ క్లాస్ లకు రాష్ట్ర ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్ల కేటాయించడంపై మధ్యప్రదేశ్ హైకోర్టులో కేసునడుస్తుండటంతో ఎంపికలో జాప్యం జరిగిందని, మిగతా 13 శాతం పోస్టులు కూడా త్వరలో తీస్తామని అధికారులు తెలిపారు.
Discussion about this post