ఆస్ట్రాజెనెకా ఫార్మాస్యుటికల్స్ కోవిడ్ – 19 కోసం రూపొందించిన వాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ నుంచి తొలగిస్తోంది. ఆస్ట్రాజెనెకా ఫార్మాస్యుటికల్స్, ఆక్సఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా రూపొందించిన ఈ టీకాను భారత్ లోని Serum Institute of India లో కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేశారు. బ్రిటీష్ ఫార్మస్యుటికల్ కంపెనీ దాని దుష్ర్ఫభావాలపై కోర్డుకెక్కడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
కోవిడ్ 19 టీకాలను నవీనకరించిన తర్వాత మార్కెట్లో మిగులున్న వాటిని ప్రపంచ మార్కెట్ల నుంచి తొలగిస్తున్నామని ఆస్ట్రాజెనెకా ఫార్మాస్యుటికల్స్ యాజమాన్యం తెలిపింది. ఇకపై వీటిని ఉపయోగించకుండా స్వచ్ఛందంగా మార్కెట్ నుంచి వీటిని తొలగిస్తున్నామని తెలిపింది. అతిపెద్ద ఫార్మాస్యుటికల్ కంపెనీ అయిన ఆస్ట్రాజెనెకా బ్రిటన్ కోర్టులో 100 మిలియన్ డాలర్ల లా సూట్ ను ఎదుర్కొటోంది. అతికొద్ది మంది మాత్రమే ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గడం జరుగుతుందని కంపెనీ అంతకుముందే తెలిపింది. అయితే దీని ద్వారా ఒక్క బ్రిటన్ లోనే 81 మరణాలు సంభవించాయని కోర్టు కేసులు చెబుతున్నాయి.
స్వతంత్ర అంచనాల ప్రకారం ఇది 6.5 మిలియన్ల ప్రాణాలు రక్షించిందని, ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల వాక్సీన్లను సప్లై చేశామని ఆ సంస్థ తెలిపింది. పాండమిక్ ను నియంత్రించడంలో మా కంపెనీ కృషిని అనేక ప్రభుత్వాలు గుర్తించాయిని కంపెనీ చెప్పింది. ఇకపై రెగ్యులేటర్లు, పార్టనర్లతో కలసి కోవిడ్ మహమ్మారి అంతానికి నాంది పలుకుతూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నామని ఆస్ట్రాజెనెకా తెలిపింది.
Discussion about this post