సురేష్ గోపీ… ప్రముఖ మలయాళ నటుడు. లోక సభ ఎన్నికల్లో పోటీ చేసి వార్తల్లోకెక్కారు.బీజేపీ తరపున త్రిసూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 250..సినిమాల్లో గోపి నటించారు. సురేష్ గోపి 1965లో ‘ఓడాయిల్ నిన్ను ‘ చిత్రం ద్వారా బాల నటుడిగా సినీరంగానికి పరిచయమైనారు.ఎన్నోఅవార్డులను కూడా అందుకున్నారు. నటుడిగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నటనలో ఆయనది డిఫరెంట్ స్టైల్. మరి రాజకీయాల్లో?
సురేష్ గోపి విద్యార్థి దశలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఎస్.ఎఫ్.ఐ. విద్యార్థి సంఘంలో పనిచేశారు. 2006లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అభ్యర్థి వి.ఎస్. అచ్చుతానందన్ తరపున మలంప్పుళా నియోజకవర్గంలోను, యూడీఎఫ్ అభ్యర్థి ఎంపీ. గంగాధరన్ తరపున పొన్నాని నియోజకవర్గంలోనూ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. కమ్యూనిస్ట్ భావాలున్న సురేష్ గోపి బీజేపీ వైపు మొగ్గు చూపడం చిత్రం.
2016 లో సురేష్ గోపి భారతీయ జనతా పార్టీలో చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైనారు. సురేష్ గోపి 2019లో లోకసభ ఎన్నికల్లో బీజేపీ తరపున త్రిసూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సురేష్ కి 2,93,822 ఓట్లు వచ్చాయి. పోటీ లో 93,633..ఓట్ల మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాపన్ గెలుపొందారు. త్రిసూర్ నియోజకవర్గంలో ఒక సారి కాంగ్రెస్ .. మరో సారి సీపీఐ గెలుస్తుంటాయి. ఆ రెండు పార్టీలకు అక్కడ మంచి బలముంది. సురేష్ గోపి కాబట్టి పెద్ద సంఖ్యలో ఓట్లు వచ్చాయి. అంతకు ముందు మరొకరు అక్కడ బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగగా కేవలం ఒక లక్షా రెండువేల ఓట్లు మాత్రమే వచ్చాయి.
సురేష్ గోపీ 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిసూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సురేష్ కి 40,457 ఓట్లు వచ్చాయి. సీపీఐ అభ్యర్థి బాలచంద్రన్ 4..వేల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ రెండో ప్లేసులో నిలిచింది.
Discussion about this post