భారతీయ సమాజంలో వివాహం అనేది ‘పాటలు, డ్యాన్స్, విందు కోసం లేదా కట్నాలు, కానుకలను డిమాండ్ చేసే సందర్భం కాదని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. “హిందూ వివాహం ఒక సంస్కారమైన మతకర్మ. ఇది భారతీయ సమాజంలో గొప్ప విలువ కలిగిన వ్యవస్థ. అందువల్ల యువతీ యువకులు వివాహ వ్యవస్థలోకి ప్రవేశించే ముందు కూడా దాని గురించి లోతుగా ఆలోచించాలని కోరుతున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
హిందూ వివాహ సాంప్రదాయంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహం పవిత్ర లక్షణాలను ప్రస్తావిస్తూ.. అది ఒక పవిత్రమైన మతపరమైన పక్రియ అని స్పష్టం చేసింది. అంతేకాదు హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే వివాహ క్రతువు సముచితమైన మర్యాదలతో నిర్వహించాలని కోర్టు నొక్కి చెప్పింది. సప్తపది అనగా పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడు సార్లు తిరగడం వంటి వేడుకలను గురించి ప్రస్తావించింది. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం హిందూ వివాహం మతకర్మ అని, “ఆట పాట”, “విందు భోజనాల” కోసం జరిగే కార్యక్రమం కాదన్నారు.
వివాహం అనేది వాణిజ్యపరమైన లావాదేవీ కాదు. ఇది ఒక గంభీరమైన కుటుంబ వ్యవస్థకు పునాది కార్యక్రమం. భవిష్యత్తులో అభివృద్ధి చెందుబోతున్న కుటుంబానికి భార్యాభర్తల హోదాను పొందే స్త్రీ, పురుషుల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుందని కోర్టు తెలిపింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హిందూ వివాహాన్ని నమోదు చేయడం వల్ల వివాహానికి రుజువు లభిస్తుందని జస్టిస్‌లు బివి నాగరత్న, అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.
“సెక్షన్ 7 ప్రకారం వివాహం జరగకపోతే రిజిస్ట్రేషన్ వివాహానికి చట్టబద్ధత ఉండదని, ఈ నిబంధన ప్రకారం హిందూ వివాహాల నమోదు కేవలం హిందూ వివాహ రుజువును సులభతరం చేయడానికి మాత్రమే అన్నారు. వివాహం చెల్లుబాటు అయ్యే హిందువుకు అవసరమైన షరతులను పాటించినప్పటికీ, నిబంధనలకు అనుగుణంగా సెక్షన్ 7 ప్రకారం హిందూ వివాహం అయి ఉండాలన్నారు. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం వివాహాన్ని ఘనంగా నిర్వహించినా.. ఆ పెళ్లికి హిందూ వివాహంగా గుర్తింపు లభించదు.
Discussion about this post