సుప్రీంకోర్టులో యోగా గురువు రాందేవ్ బాబాకు చుక్కెదురైంది. రాందేవ్ బాబాకు చెందిన పతంపలి యోగ్ పీఠ్ ట్రస్ట్ రూ.4.5 కోట్లు చెల్లించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం అలహాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.
రాం దేవ్ బాబాకు చెందిన యోగ్ పీఠ్ ద్వారా యోగా క్యాంపులు నిర్వహిస్తుంటారు. 2006 మార్చి నుంచి 2011 వరకు నిర్వహించిన క్యాంపులతో రూ.4.5 కోట్ల సేవా పన్ను విధించింది. అది సేవ కిందకు వస్తుందని, సేవా పన్ను చెల్లించాలిని కస్టమ్స్ ఎక్సైజ్ విభాగం అంటోంది. అది సేవా పన్ను కిందకు రాదని పతంజలి వాదిస్తోంది. మీరట్‌కు చెందిన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో రాందేవ్ బాబా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ నిరాశ తప్పలేదు. ఆ రూ.4.5 కోట్లు చెల్లించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
Discussion about this post