క్రికెట్ అభిమానులందరికీ ఆమె నవ్వు అపూర్వం .. ఆమె హావభావాలకు వారంతా ఫిదా.. ఆరెంజ్ ఆర్మీకి ఆమె సారధ్యం వహిస్తారు.. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుకొచ్చారా ?…ఆమె నండి.. యూత్ కలల రాకుమారి.. కావ్యా మారన్..ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్… ఆమె గురించి మరింత సమాచారం మీకోసం..
ఐపీఎల్ వేలంలో మొదటిసారి కనిపించిన కావ్య మారన్.. క్రికెట్ అభిమానులను ఆకర్షించారు. స్టేడియంలో కెమెరామెన్స్ కూడా కావ్యపైనే స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు. 31 ఏళ్ల కావ్య చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. యూకేలో వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. కావ్య ఆస్తి విలువ సుమారు రూ.409 కోట్లు. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా కావ్య నియమితులయ్యారు. అప్పుడే క్రికెట్‌తో తన ప్రయణాన్ని మొదలుపెట్టారు. ఐపీఎల్‌తో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. కావ్య మారన్ వ్యక్తిగత జీవితం పూర్తిగా గోప్యంగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఉండరు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్. ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఉత్సాహపరుస్తుంది. కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడినప్పుడు కావ్య కన్నీటి పర్యంతమైతే ఆమెను చూసి అందరూ బాధపడ్డారు. పంజాబ్ జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ గెలుపుతో ఆమె ముఖంలో నవ్వులు విరబూసాయి. ఆమె హావాభావాలకు సంబంధించిన మీమ్స్‌గా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సంతోషంలో ఉన్నప్పుడు కేరింతలు.. బాధగా ఉన్న బుంగ మూతి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటే అందరి చూపులు కావ్య మారన్‌పైనే ఉంటాయి. ఆమె కోసమే మ్యాచ్ చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల ముద్దుల కూతురే కావ్య మారన్. అమె వయస్సు 32 ఏళ్ళు. 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్నించారు. ఎంబీఏ పట్టా పోందిన కావ్య.. సన్ నెట్వర్క్ సన్ మ్యూజిక్, ఎఫ్ఎం చానల్స్ బాధ్యతలను చూసుకుంటుంది. త్వరలోనే సన్‌గ్రూప్ బాధ్యతలను మెుత్తం తనే చూసుకోబోతుంది.
Discussion about this post