సూర్యునిలో అయస్కాంత క్షేత్రం ఎక్కడ ఏర్పడుతుందో సైంటిస్టులు కనుగొన్నారు. సూర్యునిలో బలమైన అయస్కాంత క్షేత్రం ఉంటుందని, ఇదే సూర్యుడి ఉపరితలంపై మచ్చలు ఏర్పడటానికి కారణమవుతుందని వారు తెలిపారు. ఈ మేగ్నటిక్ ఫీల్డ్ గురించి తెలుసుకుంటే సోలార్ తుఫాన్లు ఎలా ఏర్పడతాయో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా గ్రహం చుట్టూ ఆరాలను కూడా సృష్టిస్తోంది.
శతాబ్దాల పాటు మేగ్నటిక్ ఫీల్డ్ పై ఖగోళ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో 1600 లో సూర్యుని ఉపరితలంపై మచ్చలను గమనించారు. వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త థియరీని నాచురల్ జర్నల్లో ప్రచురించారు. దీని ప్రకారం సూర్యుని అంతర్గత భాగం నుంచి ఈ అయస్కాంత క్షేత్రం పుట్టి ఉపరితలానికి చేరుతుంది. ఈ శాస్త్రవేత్తల బృందం అభివృద్ది చేసిన సోలార్ సైకిల్ వల్ల అంతరిక్ష వాతావరణం తెలుసుకుంటానికి ఉపయుక్తంగా ఉంటుంది. జీపీఎస్ , కమ్యూనికేషన్ శాటిలైట్లను మరింతగా అభివృద్ది చెందించవచ్చు. వాటి పనితీరును తగ్గించే విషయాలు కూడా తెలుస్తాయి. మిరమిట్లు గొలిపే ఆకాశం దాని చుట్టూ ఉండే ఆరాలు గురించి కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి రానున్న సోలార్ సైకిల్ బలంగా ఉందా లేదా బలహీనంగా ఉందా అనే విషయంపై స్పష్టత లేదనన్నారు.
సూర్యుడి విషయాలను బహిర్గతం చేసింది సూర్యుని లోని మచ్చలే. మండే గోళమైన సూర్యుడిలో పేలుళ్లు ఎలా సంభవిస్తున్నాయి ? ఎలాంటి ఒత్తిడిలకు గురవుతుంది ? కాంతి ఎలా విడుదల అవుతుంది ? సోలార్ లో ఉన్న పదార్థాలేమిటి ? దాని నుంచి అంతరిక్షంలోకి శక్తి ఎలా వెలువడుతోంది అన్న విషయాలు త్వరలో తెలియనున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న సూర్యుడి ఉపరితల నల్లమచ్చలు పెరుగుతుండటంతో అయస్కాంత క్షేత్రం బలమవుతోందని శాస్ర్తవేత్తలు కనుగొన్నారు. అయితే అయస్కాంత క్షేత్రంలోని రేఖలను చూడటం కష్టం. భూమి అయస్కాంత క్షేత్రం కంటే ఇది చాలా బలంగా, సంక్లిష్టంగా ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో అని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం టోర్షనల్ ఆసిలేషన్ ను ఉపయోగిస్తున్నారు. సూర్యుని కేంద్రకంలో గ్యాస్ లు, ప్లాస్మా లు తిరుగుతూ నల్ల మచ్చలను రూపొందిస్తాయి. కొన్ని ప్రదేశాల్లో సోలార్ ప్రదక్షిణాలు స్లోగాను, మరి కొన్ని చోట్ల స్పీడ్ గా ఉండటానికి కారణాలు, కొన్ని చోట్ల స్థిరంగా ఉండటానికి కారణాలు తెలుసుకుంటున్నారు. సూర్యుడి గురించి తెలుసుకోవడంతో సూర్యుడి లోని పదార్థాలు ఎలా పరిభ్రమిస్తాయన్న విషయం తెలుస్తుంది. వివిధ రంగాల శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో 20 వేల మైళ్ల నుంచి 130 వేల మైళ్ల వరకు అయస్కాంత క్షేత్రం ఏర్పడి ఉపరితలానికి వస్తుందన్నారు.
Discussion about this post