భారత్‌లో ఐటీ ఉద్యోగాలకు చాలా క్రేజ్ ఉంది. దేశంలో ఎక్కవగా చదువుతున్న బ్రాంచ్‌ల్లో కంప్యూటర్ సైన్స్‌దే హవా. యువత అత్యధికంగా ఉపాధి పొందుతున్న రంగాల్లో ఐటీ మొదటి వరుసలో ఉంటుంది. హైదరాబాద్, బెంగుళూరు లాంటి నగరాల్లో అయితే మరి అధికం. కానీ.. కరోనా మొదలేనప్పటి నుంచి లేఆఫ్‌ల పర్వం నడుస్తోంది. ఈ ప్రభావం భారత్ తీవ్రస్థాయిలో పడుతోంది. టెకీలను ఆందోళన కలిస్తున్న లేఆఫ్‌ల ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం.
కొవిడ్‌తో మొదలైన లేఆఫ్‌ల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ, టెక్, స్టార్టప్ కంపెనీలు పెద్దఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాదిలోనూ ఆ సంఖ్య భారీగానే ఉంది. టెస్లా, గూగుల్, యాపిల్ అనేక పెద్ద కంపెనీలూ ఉద్యోగులను తొలగించిన జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 80 వేల మంది ఉద్యోగులను తొలగించగా.. ఒక్క ఏప్రిల్‌లోనే ఏకంగా 20వేల మందిని సాగనంపాయి.
ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ 600 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరిలో చాలామంది స్మార్ట్ కారు, స్మార్ట్‌వాచ్ డిస్ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నవాళ్లే. భారీ ఖర్చు సహా వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్టులను యాపిల్ పక్కన పెట్టింది. ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ తన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలమంది ఉద్యోగులను తొలగించింది. ఇంటెల్ సంస్థ సేల్స్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 62 మందిని ఇంటికి పంపింది. ఆర్థిక సమస్యల కారణంగా బైజూస్ ఏప్రిల్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించింది.
ఎలాన్‌మస్క్‌కు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 10 శాతం మందిని విధుల నుంచి తొలగించింది. ఓలా క్యాబ్స్ 10 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. టెక్, ఇంజినీరింగ్, ప్రొడక్ట్ టీమ్‌కు చెందిన దాదాపు 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తిఫైమీ 150 మంది ఉద్యోగులను తొలగించింది. వర్ల్‌పూల్ 1,000 మందిని, టెలినార్ 100 చొప్పున ఉద్యోగాలు తొలగించాయి.
Discussion about this post