ప్రస్తుతం నడుస్తోందంతా ఆన్లైన్ లావాదేవీలే… అయినా సరే లిక్విడ్ క్యాష్ కూడా ఉండాల్సిందే..కొన్ని సార్లు అది లేనిదే ఏ పని జరగదు. నగదును ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకున్నప్పుడు చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఇక వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక చాలా మంది తంటాలు పడుతుంటారు… డ్యామెజ్ అయిన నోట్లను ఈజీగా మార్చుకోవచ్చు… ఎలా మార్చుకోవాలి? దానికి ఉన్న నిబంధనలు ఏంటి ? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అనే విషయాలు మీకోసం..
సాంకేతికత ఎంత ఉన్నా… కొన్ని అంశాలు మేన్యువల్‌గానే చేయాల్సి ఉంటుంది… ఇక డబ్బుల విషయంలో కూడా ఇది వర్తిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. అన్ని సార్లు ఆన్లైన్ లావాదేవీలు చేయలేని పరిస్థితులు ఉంటాయి… అలాంటప్పుడు నగదు మార్పిడీలు, కొనుగోళ్లు, విక్రయాలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం నగదును ఏటీఎంలలో విత్‌డ్రా చేయాల్సి ఉంటుంది.. ఆ సమయంలో కొన్ని నోట్లు చిరిగినవి వస్తుంటాయి. వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు… కానీ వాటిని సులువగా మార్చుకోవచ్చని ఆర్బీఐ మార్గదర్శకాలను ఎప్పుడో విడుదల చేసింది. 2017లోనే వాటిని రిలీజ్ చేసింది. చిరిగిన నోట్లు వస్తే వాటిని తీసుకోవడానికి బ్యాంకులు నిరాకరించకూడదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు టీవీ ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇప్పుడు ఏటీఎం నుంచి వచ్చిన చిరిగిపోయిన నోట్లను అతికించి రహస్యంగా చెలామణి చేసే బదులు, ఆర్బీఐ నిబంధనల ప్రకారం వాటిని మార్చుకుని కొత్త నోట్లను పొందవచ్చు.
ATM నుండి డబ్బును విత్‌డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు చిరిగిన నోట్లు, పాతబడ్డ నోట్లు వచ్చినట్లయితే ఆందోళన చెందుతుంటారు. కానీ, పెద్ద నోటు, చిన్న నోటు అని ఆందోళన చెందాల్సిన పనిలేదు. సులువుగా మార్చుకుని కొత్త నోటు పొందవచ్చు. చాలా మందికి ఈ విషయం తెలియక టెన్షన్ పడుతుంటారు. కానీ వాటిని సులువుగా మార్చుకుని కొత్త నోట్లు తీసుకోవచ్చు. చిరిగిన నోట్లను ఏటీఎం మెషిన్ బయటకు వచ్చిన వెంటనే బ్యాంకుల దగ్గరకు తీసుకువెళ్లాలి.. ఆ తర్వాత ఓ అప్లికేషన్ రాయాలి. అందులో మీరు డబ్బు తీసుకున్న తేదీ, డబ్బు విత్‌డ్రా చేసిన సమయం, మీరు డబ్బు విత్‌డ్రా చేసిన ఏటీఎం పేరును మెన్షన్ చేయాలి. దీనితో పాటు, ఏటీఎం నుండి జారీ చేసిన స్లిప్ కాపీని కూడా జతచేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు స్లిప్ జారీ చేయకపోతే, మీరు మొబైల్లో స్వీకరించిన లావాదేవీల వివరాలను తెలియజేయవచ్చు.
అన్ని బ్యాంకులు, బ్రాంచ్‌ల్లో అలాంటి నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ కూడా ఎప్పటికప్పుడు సర్క్యలర్లను జారీ చేస్తూనే ఉంటుంది. దాన్ని అనుసరించి బ్యాంకులు పని చేస్తుంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, ప్రైవేటు సెక్టార్ బ్రాంచ్‌ల్లో మార్చుకోవచ్చు. ఇక 10 కంటే ఎక్కువ విలువైన నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉంది.ఒక వ్యక్తి ఒకసారి 20 నోట్లను మార్చుకునే వీలుంది. మార్చుకునే నోట్ల విలువ 5 వేలకు మించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
సో చిరిగిపోయిన నోట్లు వస్తే నో టెన్షన్… హాయిగా బ్యాంకులకు వెళ్లి..చిన్న అప్లికేషన్ రాసిచ్చి… వాటి స్థానాల్లో కొత్త నోట్లు తీసుకోవచ్చు… ఇంకేందుకు ఆలస్యం…మీ దగ్గర ఇలాంటి చిరిగిన నోట్లు ఉంటే సరైన ఆధారాలతో వెళ్లి ఎక్స్ ఛేంజ్ చేసుకొండి…
Discussion about this post