తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ప్రచారంలో జోష్ పెంచాయి. జాతీయపార్టీలు మ్యానిఫెస్టోను కూడా విడుదల చేశాయి. మరో మూడు రోజుల్లో నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతారని, మరో ఏక్నాథ్ షిండే అవుతారని ఈ మధ్య బీఆర్ఎస్ నేతలు వరుసగా కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మాటలకు బలం చేకూరుస్తూ రేవంత్‌రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు. అంతేకాదు..రేవంత్‌కు 15 ఏళ్ల రాజకీయ జీవితం ఉందన్న ఆయన.. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని విమర్శించారు. సీఎం రేవంత్ సమర్థుడేకానీ.. కాంగ్రెస్ పార్టీలో ఉంటే అసమర్థుడిగా మారిపోతారన్నారు.
Discussion about this post