ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ అడవిలో కార్చిచ్చును అదుపులోకి తేవడానికి భారత వైమానికా దళం బాంబి బకెట్ ను వాడుతోంది. దీనిద్వారా దగ్గర్లోని భీమ్టాల్ సరస్సుల్లోని నీటిని హెలికాఫ్టర్ల ద్వారా తెచ్చి అడవిలోని అగ్ని కీలకాలను అదుపులోకి తెస్తున్నారు. అసలు బాంబీ బకెట్ అంటే ఏమిటి ? ఎవరు కనుగొన్నారు ? ఉపయోగాలేమిటో తెలుసుకుందాం..
అగ్నిని కంట్రోల్ చేయడానికి హెలికాఫ్టర్ల ద్వారా వినియోగించే బకెట్లను బాంబీ బకెట్ లేదా హెలి బకెట్ లేదా హెలికాఫ్టర్ బకెట్ అంటారు. గాల్లోంచి మండుతున్న అడవులపైకి నీటిని చల్లటానికి బాంబీ బకెట్ ను ఉపయోగిస్తారు. ఇవి 1980 నుంచి వాడుకలో ఉన్నాయి. హెలికాఫ్టర్ నుంచి నిర్థేశిత ప్రదేశంలో నీళ్లు పడేలా పైలెట్ కంట్రోల్ లో కవాటం ఉంటుంది. ఇది చాలా త్వరగా నిండుతుంది. సరస్సులు, స్విమ్మింగ్ ఫూల్స్ నుంచి కూడా నీళ్లు తీసుకోగలదు. దీనికి 270 లీటర్ల నుంచి 1000 లీటర్ల నీటిని తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. కెనడా వ్యాపారి డాన్ ఆర్నే దీనిని కనుగొన్నారు. సాలిడ్ ఫైబర్ గ్లాస్, ప్లాస్టిక్,లేదా కాన్వాస్ మెటల్ ఫ్రేమ్స్ తో బాంబీ బకెట్ ను తయారు చేస్తారు. ప్రస్తుతం 115 దేశాలు 1000 హెలికాఫ్టర్ ఆపరేటర్లు వీటిని కార్చిచ్చును కంట్రోల్ తీసుకురావడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
Discussion about this post