ఏడవ శతాబ్ధానికి చెందిన విరూపాక్ష దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. సంగమ రాజవంశం స్థాపకుడైన హరిహర1 ఈ దేవాలయాన్ని కట్టించారు. 14వ శాతాబ్దంలో శక్తివంతమైన విజయనగర రాజులు దీనిని తుంగభద్ర నది వరకు విస్తరించారు. కళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు దీనిని తీర్చిదిద్దటంతో మతపరమైన సాంస్కృతిక కేంద్రంగా హింపి విరూపాక్ష దేవాలయం విలసిల్లింది. ద్రవిడ వాస్తుశిల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎత్తైన గోపురరాలు, గర్భాలయంలపై శిఖరాలు, జఠిలమైన చిత్రాలతో పెద్దపెద్ద స్థంభాలతో గదులు నిర్మించారు. శిల్పాలతో అలంకరించబడిన ఈ గోపురం వివిధ దేవతలను, పౌరాణిక దృశ్యాలతోపాటు జంతువులు ఉన్నాయి. గర్భ గుడిలో శివలింగం పూజలు అందుకుంటుంది. మంటపాల్లో వ్యాపారులు అనేక రకాలైన పూజా సామాగ్రిని భక్తులకు విక్రయించేవారని, కొన్నిసార్లు విడిదికి కూడా ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడే మరికొన్ని ఆలయాలు ఉన్నాయి. హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా విలసిల్లింది. దక్షిణ భారతంతో గొప్ప హిందూ రాజ్యంగా స్మారక చిహ్నంగా నెలకొంది. దీంతో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.
మండపాలన్నీ రాతి పిల్లర్లతో నిర్మించారు. పెద్దపెద్ద వర్షాలు రోజుల తరబడి రావడంతో పిల్లర్లు దెబ్బతిన్నాయని ASI అధికారులు చెబుతున్నారు. నాలుగు స్థంభాలతో19 మీటర్ల పొడవున్న మండపంలో కేవలం 3 మీటర్ల మండపం దెబ్బతిందని ఆర్కియోలాజికల్ సూపరింటెండెంట్ నిహిల్ దాస్ చెప్పారు. మరో నాలుగేళ్లలో మండపం అంతా కూలిపోనుందని అందుకే మండపం అంతా పునర్నిర్మిద్దామనుకున్నామన్నారు. అయితే భారీ వర్షాలకు అనుకున్నదానికంటే ముందే పడిపోయిందన్నారు. హంపిలోని 95 స్మారక చిహ్నాల్లో 57 కేంద్రం పరిరక్షించాల్సి ఉంది. మిగతావి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. పునర్నిర్మాణం ప్రారంభించే ముందు అన్నింటిని ASI డిజిటల్ డాక్యుమెంట్ చేసింది. 2019లో పునర్నిర్మాణం ప్రారంభించారు. మొదటి దశ 2019 – 20 పూర్తి చేయగా, రెండో దశ 2022లో పూర్తి చేశారు. మండపాన్ని తర్వాత కట్టేవారు. ప్రస్తుతం ఒక భాగం పడిపోయింది. ప్రాధాన్యతా పరంగా మండపాన్ని పూర్తిగా కూల్చి వేసి మళ్లీ కడదామని ASI భావించింది. వర్షాలకు మండపం కూలగానే హంపి సర్కిల్ ASI సీనియర్ ఆర్కియాలజిస్టులు,వారసత్వ సంపద పరిరక్షకులు, ఇంజనీర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితిని డాక్యుమెంట్ చేయడంతోపాటు డామెజ్ భాగాన్ని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారని, మరింతగా దెబ్బతినే పరిస్థితిని రానీబోమన్నారు.
పునరుద్దరణ పనులను పెద్ద, చిన్న గా విభాగించి వాటిని నిధుల కోసం ASI డైరెక్టర్ కు పంపుతారు. నిర్మాణం పనులన్నీ నిధులు, సంబంధిత వస్తువుల రవాణా, మానవ వనరులపై ఆధారపడి ఉంటుందని ASI అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కల్వాణ కర్ణాటక పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇది విజయనగరం నుంచి బీదర్ వరకు ఉన్న స్మారకాల పనులు పూర్తి చేసింది. ప్రస్తుతం రాతి స్థంభాలను నిర్మించాల్సి ఉంది. దీని కోసం అప్పటి రాజులు వాడిన రాళ్ల వంటి వాటినే వాడాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఎక్కువ సమయం పట్టినా సంప్రదాయ పద్దతిని పాటించాలని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం మండపం అంతా పడగొట్టి కొత్తది కట్టడానికి 3 నుంచి 4 నెలలతోపాటు రూ. 50 లక్షల ఖర్చవుతుందని నిహిల్ దాస్ చెప్పారు.
ఈ నిర్మాణాలను పరిరక్షించేందుకు యునెస్కో సైతం తన వెబ్ సైట్ ను ఓపెన్ చేసి తన ఆందోళనను వ్యక్తం చేసింది. “విరూపాక్ష దేవాలయం నిరంతరం పూజలో ఉంది, ఇది ఆలయ సముదాయంలోని వివిధ భాగాలకు అనేక చేర్పులు మార్పులకు దారితీసింది. అదేవిధంగా, విరూపాక్ష దేవాలయం ముందు ఉన్న పురాతన మార్గంలో తారు రోడ్లు వేయడంతో పాటు దాని చుట్టూ ఉన్న ఆధునిక దుకాణాలను, రెస్టారెంట్లను ఎత్తులో నిర్మించడం దేవస్థానం పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి విరూపాక్ష దేవాలయాన్ని పరిరక్షించాలని భక్తులు, పురావస్తు పరిరక్షకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
Discussion about this post