ఇటీవల తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం పెద్ద హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే . ఒక పక్క లిక్కర్ స్కామ్ , మరోపక్క ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం కల్వకుంట్ల కుటుంబాన్ని , BRS పార్టీని ఇరకాటం లో పడేశాయి . కాగా తన కూతురు కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి రక్షించుకునేందుకు గులాబీ బాస్ బిగ్ స్కెచ్ వేశారు. ఇందుకోసం ఆపరేషన్ ఫాం హస్ కథను నడిపినట్టు తెలుస్తోంది. ఇందులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసి.. బిడ్డను లిక్కర్ స్కాం కేసు నుంచి తప్పించాలని ప్లాన్ చేసినట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఆధారంగా వెల్లడవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం లో నిందితుడుగా ఉన్న రాధాకృష్ణా రావు ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ పెద్ద దుమారానికి దారితీసింది
కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెడుతున్నట్టు కేసీఆర్ కు సమాచారం అందిందని, ఈ వివరాలను ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు చెప్పారని రాధాకిషన్ రావు తన నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. ఎస్ఐబీ చీఫ్ ఆదేశాల మేరకే తాము ఈ ఆపరేషన్ లో పాల్గొన్నామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కొన్ని ఆడియోలు కేసీఆర్ కు అందగానే ఎమ్మెల్యేలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నం మొదలైందని, ఫాంహౌస్ లో ట్రాప్ చేసేందుకు స్పై కెమెరాలు, మెటీరియల్ ఢిల్లీలో కొనిపించారని రాధాకిషన్ రావు తన స్టేట్ మెంట్ లో తెలిపారు.
బీఎల్ సంతోష్ అరెస్ట్ చేయిస్తే బీజేపీ అధిష్టానం రాజీ కి వస్తుందని తద్వారా తన కూతురుని లిక్కర్ స్కాం కేసు నుంచి విముక్తురాలిని చేయాలని కేసీఆర్ భావించారని తెలుస్తోంది . దీని కోసం సహకారం అందించడం లో కేరళ సైబర్ పోలీస్ అధికారులు విఫలమౌతే తెలంగాణ పోలీస్ బృందం కేరళకు వెళ్లివచ్చిందని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు . తర్వాత ఇందుకోసం ఆపరేషన్ ఫాం హౌస్ కథ నడిపారని తెలుస్తోంది . 2022 అక్టోబర్ 26న కొల్లాపూర్, అచ్చంపేట, తాండూరు, పినపాక, ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు తో డీల్ సెట్ చేసుకునేందుకు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ వచ్చారని పేర్కొన్నారు రాధాకిషన్ రావు తన నేరాంగీకార పత్రంలో తెలిపారు .
ఈ వ్యవహారం మొత్తం ట్రాప్ చేసేందుకు ఢిల్లీలో ఖరీదైన కెమెరాలు, మెటీరియల్ కొనిపించారని రాధాకిషన్ రావు తెలిపారు. వాటి ఆధారంగా రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ను ట్రాప్ చేశారని, వారిపై రకరకాల కేసులు నమోదు చేశారని తెలిపారు. అప్రూవర్లుగా మారి అమిత్ షా, తుషార్, బీఎల్ సంతోష్, నడ్డా పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో నందకుమార్ పై మూడు రోజుల్లోనే 11 కేసులు నమోదయ్యాయి. బీఎల్ సంతోష్ పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చినా చెప్పకపోవడంతో కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ మొత్తం బెడిసికొట్టింది.అంతే కాకుండా టీవీ చానెల్స్ అధినేతలతో సహా కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్ టాపింగ్ జరిగిందని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం.
Discussion about this post