పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్ నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దఖలుకు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు వచ్చారు. సీఎం హోదాలో ఆయన మొదటిసారిగా జిల్లా వస్తున్న ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి భారీ జన సమీకరణ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సింగ్మెంట్లలో 2014లో బిఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, 2019లో బిజెపి నుంచి అరవింద్ గెలవగా ఈసారి ఎలాగైనా నిజామాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే వ్యూహరచన లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు .
Discussion about this post