అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్రమ సంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు ఇచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నాన్‌డిజ్‌క్లోజర్ అగ్రిమెంట్‌ను రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత స్టార్మీ కోర్టును ఆశ్రయించడంతో ఇది వెలుగు చూసింది. దీంతో న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు నమోదు చేసింది. అయితే లైంగిక కుంభకోణాలు శ్వేత భవనానకి కొత్తకాదు.. క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించి అధ్యక్ష పదవికి కళంకం తెచ్చిన వారెవరెవరో తెలుసుకుందాం..
ఈ భూమిపై అత్యంత శక్తివంతుడు అమెరికా అధ్యక్షుడని అందరూ నమ్ముతారు. క్రమశిక్షణారాహిత్య అధికారం చివరికి అందాల బామల ఆకర్షణకు లొంగిపోతుందని అనేకమంది అమెరికా అధ్యక్షులు నిరూపించారు. వారిలో థామస్ జెఫర్సన్, జాన్ ఎఫ్ కెనడీ, జార్జిబుష్, బిల్ క్లింటన్, గెరాల్డ్ రుడాల్ఫ్ ఫోర్డ్ జూనియర్, ట్రంప్ ఉన్నారు. వీరి పదవీ కాలంలో లైంగిక దుష్ప్రవర్తన, కుంభకోణాల ఆరోపణలు అమెరికా శ్వేతభవనాన్ని కుదిపి వేశాయి. ట్రంప్ అధ్యక్షుడు కాకముందే శృంగార తార స్టోర్మీ డేనీతో ఆయనకు అక్రమ సంబంధం ఉంది.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం మొత్తం వివాదాల మయం. కొన్ని తీవ్రమైన ఆరోపణలు, డజన్ల కొద్ది అక్రమ సంబంధాల ఆరోపణలున్నాయి. 1970లోనే 26 మంది మహిళలు ఆయన దుష్ప్రవర్తన పై ఆరోపణలు చేశారని బిజినెస్ ఇన్ సైడర్ తెలిపింది. ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే మంచి ధనవంతుడు. ఆయనపై మొదట లైంగిక ఆరోపణలను ఆయన మొదటి భార్య ఇవనా మేరీ ట్రంప్ చేశారు. ఆపై వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆపై నటి మార్లా మాపుల్స్ ట్రంప్ గురించి ప్రచారం జరిగింది. ఆ తర్వాత వారిద్దరికీ పెళ్లి అయ్యింది. ఆయన పదవిలో ఉండగానే ట్రంప్ బాధితులు ఆరోపణలు చేశారు.
అధ్యక్ష పదవిలో ఉండగా రెండుసార్లు అభిశంసన ఎదుర్కొని నెగ్గారు ట్రంప్. ప్రస్తుతం ఆయన 2021జనవరి 6న వాషింగ్టన్ లోని కేపిట్ బిల్డింగ్ పై ఆయన అనుచరులు జరిపిన దాడి ఘటన, వైట్‌హౌస్ నుంచి కీలక పత్రాల మిస్సింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. పోర్న్‌స్టార్‌తో అనైతిక ఒప్పందం కేసులో ఆయన చుట్టూ బలంగా ఉచ్చు బిగిస్తోంది. ఈ వ్యవహారంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మోసానికి పాల్పడ్డారన్నది ప్రాసిక్యూషన్ వాదన.
2016లో వాషింగ్టన్ ప్రచురించినన దాని ప్రకారం ట్రంప్ ఒక మహిళను ఆమె అనుమతి లేకుండా కిస్ ఇచ్చినట్లు తెలిసింది. ట్రంప్ ఒకప్పటి బిజినెస్ అసోసియేట్ అయిన జిల్ హర్త్ కూడా తనను లైంగికంగా వేధించినట్లు 1990ల్లో కేసు వేసింది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్ విషయం బయటకు రాకుండా ఉండేందుకు అనేక మందికి డబ్బులిచ్చారని కోర్టు భావిస్తోంది. అయితే రాజకీయంగా తనను తొక్కివేసేందుకే ఈ ఆరోపణలు చేస్తు్న్నారని ట్రంప్ మండిపడుతున్నారు.
Discussion about this post