భారత దేశం నుంచి మొదటి అంతరిక్ష యాత్రికుడిగా గోపి తోటకూర ఉన్నారు. ఆయన కమర్షియల్ పైలెట్ గా పనిచేశారు. ఆయనతోపాటు ఆ ట్రిప్ లో మరో ఐదుగురు టూరిస్టులున్నారు. అమెరికాలో ఉంటున్న గోపి తో పాటు మరో 50 మంది అంతరిక్ష యాత్రలో పాల్గొనటానికి గత మూడేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. బ్లూ ఆరిజిన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఆయన ప్రయాణం కొనసాగనుంది. ఈ ప్రయాణం అతికొద్ది సమయం కేవలం 10 నిముషాలు మాత్రమే జరుగుతుంది. భూమి నుంచి 105 కిమీ దూరం వెళుతుంది. ఈ టూరిజంలో 90 ఏళ్ల అమెరికన్ కూడా ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత బరువు కోల్పోవడం వంటి వాటిని వీరు ఫీల్ అవుతారు.
ఈ ట్రిప్ లో భూ వాతావరణం నుంచి అంతరిక్షాన్ని వేరుచేసే కర్మాన్ లైన్ ను దాటుతున్నారు. ఈ ప్రయాణాన్ని సబ్ ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్ అంటారు. అయితే అంతరిక్షంలో మరింత దూరం ప్రయాణించే వెలుసుబాటు కూడా అందుబాటులో ఉంది. శాశ్వత అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ ISS భూమికి 400 కిమీ దూరంలో ఏర్పాటు చేశారు. 2001 రష్యన్ సోయుజ్ స్పేస్ క్రాఫ్ట్ లో అమెరికన్ డెన్నిస్ టిటో ప్రయాణించి 7 రోజులు ISSలో గడిపారు. 2001 నుంచి 2008 వరకు రష్యన్ రాకెట్ ఏడుగురు టూరిస్టులను తీసుకెళ్లింది. చార్లెస్ సిమోన్వి రెండుసార్లు ప్రయాణించారు. జపాన్ కు చెందిన బిలియనీర్ మరో ఇద్దరు కూడా రష్యా స్పేస్ క్రాఫ్ట్ లో 12 రోజుల పాటు ప్రయాణించారు. అమెరికాకు చెందిన బ్లూ ఆరిజన్ ఇప్పటివరకు 37 మంది టూరిస్టులను తీసుకెళ్లింది. రానున్న రోజుల్లో చంద్రుడి పైకి టూరిస్టులను తీసుకెళ్లాలని ఆయా స్పేస్ కంపెనీలు భావిస్తున్నాయి.
ఈ టూరిస్టులకు అధునాతన వ్యోమగాముల శిక్షణ ఇస్తారు. టికెట్ల రేట్లలోనే ఈ శిక్షణ ఖర్చులు కూడా ఉంటాయి. వర్జిన్ గలాక్టిక్ స్పేస్ క్రాఫ్ట్ భారత కరెన్సీలో చూస్తే రూ. 3.75 కోట్లు ఉంటుంది. ISS వెళ్లడానికి 20 నుంచి 25 మిలియన్ డాలర్లు అనగా రూ. 160 నుంచి 210 కోట్లు ఉంటుంది. స్పేస్ కంపెనీలైన SpaceX , Space Adventures లు చంద్రుడిపైకి వెళ్ల డానికి 70 నుంచి 100 మిలియన్ డాలర్లు అనగా రూ.600 కోట్ల నుంచి 850 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాయి. మొత్తానికి మనకు తెలిసిందేమంటే సూపర్ రిచ్ కే ఈ అంతరిక్ష యాత్ర అందుబాటులో ఉంటుంది. కొన్ని బెలూన్ కంపెనీలు ఎత్తైన సవారీలను నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ ల నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇవి 30 కిమీ నుంచి మూడు రెట్లు అధిక ఎత్తుకు తీసుకెళతారు. వీటి ఖరీదు 50 వేల డాలర్లుగా ఉంది. వీటిలో ప్రయాణం 6 నుంచి 12 గంటలు ఉంటుంది. దీని నుంచి మనిషి తన బరువు కోల్పోవడం అనుభవంలోకి రాదు కాని, భూమి సరళ రేఖను చూడవచ్చు.
Discussion about this post