ప్రపంచ ఏడు వింతల్లో మొదటిదైన ఈజిప్టులోని గిజా పిరమిడ్ నిర్మాణానికి ఉపయోగించిన ప్రతి రాయి బరువు 2 మెట్రిక్ టన్నులు. పిరమిడ్ నిర్మాణం కోసం దాదాపు 2.3 మిలియన్ల రాళ్లను నిర్మాణంలో వాడారు. ఇంత బరువున్న రాళ్లను ఎడారి ఇసుకలో పిరమిడ్ల వరకు ఎలా తీసుకెళ్లగలిగారు అని శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడ్డారు. అయితే ఇప్పుడు ఆ సీక్రెట్ ను అధ్యయనాలు తేటతెల్లం చేశాయి.. వాటిని మీకోసం అందిస్తున్నాం…
గిజా పిరమిడ్ ను ఉదాహరణగా తీసుకుంటే పూర్వకాలపు ఈజిప్టు వాసులు 4, 500 ఏళ్ల క్రితం రెండు టన్నులున్న రాళ్లను ఎలా తీసుకెళ్లగలిగారంటే నైలు నదే దీనిని సాధ్యం చేసిందని స్కాలర్ల అధ్యయనాలు చెబుతున్నాయి. ఈజిప్ట్‌లోని పిరమిడ్‌లు గిజా, లిష్ట్ గ్రామం మధ్య ఉత్తర-దక్షిణ ఎడారిలో 50 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం నైలు నదికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఒకప్పుడు నైలు నది పిరమిడ్ల పరిసరాల్లో ఉండటం వల్లే నిర్మాణాలు సాధ్యమయ్యాయని భావిస్తున్నారు. అప్పటి సాహిత్యం కూడా ఇందుకు సాక్షిగా నిలిచింది.
ఎర్త్ అండ్ ఎన్విరానిమెంట్ జర్నల్ లో మే 16న ప్రచురించిన సమాచారం మేరకు ఒకప్పుడు నైలునదీ పరీవాహక ప్రాంతం చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో పిరమిడ్లకు పక్కనుంచి నైలు నదీ పాయ ప్రవహించేది. అందులో నుంచే 2 టన్నుల బరువైన రాళ్లు, కట్టడ సామాగ్రి, పనివారి రవాణాకు అనుకూలంగా ఉండేదని వారు వెల్లడించారు. భూ భౌతిక శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహిస్తున్న ఇమాన్ ఘోనీమ్ రాడార్ శాటిలైట్ చిత్రాలను, చారిత్రాత్మక మ్యాప్ లు, జియోఫిజికల్ సర్వేలు, ఆర్కియాలజిస్టులు అవక్షేపం కోరింగ్ టెక్నాలజీని ఉపయోగించి కొన్ని నమూనాలు సేకరించి అప్పట్లో గిజా పిరమిడ్ నైలునది పక్కనే ఉన్నట్లు నిర్థారించారు. 200 నుంచి 700 మీటర్ల వెడల్పుతో 2 నుంచి 8 మీటర్ల లోతుకలిగి 64 కిలోమీటర్లు ప్రవహించేదని, దీంతో హార్బర్లు రూపుదిద్దుకోవడంతో మిరమిడ్ల నిర్మాణం జరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
కరవు, ఇసుక తుఫాన్ల వల్ల నైలు నది కుచించుకుపోవడంతో ప్రస్తుతం ఎడారి ప్రాంతంగా గిజా మారిందంటున్నారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి అత్యాధునిక గణాంకాలను అర్థం చేసుకునే శక్తితోపాటు, వాస్తు శిల్పంలో కూడా అశేష పరిజ్ఞానం ఉండాలి. ఉదాహరణకు గిజాలోని గొప్ప మిరమిడ్ 52 డిగ్రీల వేడిలో కూడా దృఢత్వాన్ని కోల్పోకుండా ఉండటానికి ఆర్కిటెక్టులు ఎంతగా శ్రమించి వర్కర్లకు వివరించారో కదా… అక్కడ ఉన్న జంతువుల యముకలు చూస్తే..మనుష్యులు, జంతువులు, ఎంత పెద్ద మొత్తంలో ఉన్నారో ? ఎంతగా శ్రమించారో తెలుస్తోంది. వీరందరితో పనిచేయించుకోవడం పెద్ద ఛాలెంజ్ అని చెప్పక తప్పదు. పిరమిడ్ అంటే కేవలం సమాధేనని చాలా మంది అనుకుంటారు. కాని, దాని నిర్మాణ కౌశల్యం, అలంకరణ, సూర్య కిరణాల ప్రసారం ఇవన్నీ ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ అంత త్వరగా అర్థం కాదని,అంతే కాకుండా జీవితంలోని ప్రతి అంశం ఇక్కడ ప్రతిబింబిస్తుందని ఈజిప్టు శాస్త్రీయ అధ్యయన కారుడు పీటర్ డెర్ మన్యులియన్ అన్నారు. వీలుంటే మీరు ఒకసారి పిరమిడ్లను చూసి రండి..
Discussion about this post