తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మిరాయ్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తారని అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఈ సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేశారు. గ్లింప్స్‌లోని విజువల్స్.. ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. తేజ నుంచి మరో సూపర్ హీరో సినిమా రాబోతోందన్న సంగతి అర్థమైంది. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల స్థాయికి తగ్గట్టే విజువల్స్ కనిపించాయి.
‘మిరాయ్’ అంటే అర్థం ‘మిరాకిల్’ (Miracle) అని మేకర్స్ చెబుతున్నారు. టైటిల్‌తో పాటు టైటిల్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌ని కూడా మేకర్స్ గురువారం అధికారికంగా విడుదల చేశారు. ఈ టైటిల్ లుక్ పోస్టర్లో సూపర్ హీరో తేజ సజ్జా నిజంగానే ఓ సూపర్ యోధుడిగా కనిపిస్తున్నాడు. హనుమాన్ చిత్రంలో సాంప్రదాయ దుస్తులలో కనిపించిన తేజ, ఇందులో మాత్రం స్టైలిష్ మేకోవర్‌తో కనిపించాడు. ఈ పవర్ ఫుల్ స్టిల్ చూస్తుంటే.. సినిమా కూడా అంతే పవర్ ఫుల్‌గా ఉండబోతుందనేది అర్థమవుతోంది. తేజ కెరీర్లో మరో గొప్ప చిత్రం రాబోతుందనేది ఈ పోస్టర్‌తోనే తెలిసిపోతోంది.
Discussion about this post