బ్రిటీష్ ప్రభుత్వం 1853 ఏప్రిల్ 16న మొదటి రైలును భారత్ లో నడిపింది. అంటే సరిగ్గా 171 ఏళ్ల క్రితం భారత్ లో రైళ్ల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. దీంతో సరకుల రవాణా మరింత సులభతరం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్స్ ప్రెస్, మెయిల్ ఎక్స్ ప్రెస్ , ప్యాసెంజర్ రైళ్ల సర్వీసులతో పాటు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్ల కోసం దక్షిణాదిన కూడా భారత ప్రభుత్వం రైల్వే ట్రాక్ లు రూపొందిస్తోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే గా రూపొందిన భారత్ రైల్వే ట్రాక్ 1 లక్ష, 4 వేల, ఆరువందల నలభై ఏడు (647) కిలోమీటర్లు. 18వ శతాబ్దం నుంచి రైల్వేలు భారీ రిక్రూట్ మెంట్ జరుపుతోంది. రైల్వేల్లో 10 లక్షల 20 వేల మంది పనిచేస్తున్నారు. రోజుకు 12వేల 612 ట్రైన్లు రోజుకు 2 కోట్ల 30 లక్షల మందిని గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. భారత స్థితిగతుల్లో రైల్వే విప్లవాత్మక మార్పు తెచ్చిందనడంలో సందేహం లేదు. బ్రిటీషు ప్రభుత్వం మొదట గ్రానైట్, నిర్మాణ సామాగ్రిని రవాణా చేయడానికి మాత్రమే ఉపయోగించేది. 1837లో ఆర్థర్ కాటన్ మద్రాసు సమీపంలో రెడ్ హిల్స్ రైల్వేస్ ను నెలకొల్పారు.
1853లో ప్యాసెంజర్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. మొట్టమొదటి సారిగా థానే నుంచి బొంబాయిలోని పోర్ బందర్ వరకు 34 కిలో మీటర్ల దూరం ప్రయాణించింది. 3 ప్యాసెంజర్ రైళ్లు … సాహిబ్, సింధ్, సుల్తాన్ పేర్లతో ఉన్న స్టీము ఇంజన్ల సహాయంతో 14 కంపార్టు మెంట్లలో 400 మంది ప్రయాణించారు. ఇందుకోసం గ్రేట్ ఇండియన్ పెన్సిల్వేనియా రైల్వే 1,676 కిమీ వైడ్ గేజ్ రైల్వే ట్రాక్ నిర్మించింది. అప్పట్లో ఈ ట్రాన్స్ పోర్టు అంతా ప్రైవేటు ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలో సాగేది. 1855-1860 మధ్యలో 8 రైల్వే కంపెనీలను నెలకొల్పారు. అవి ద గ్రేట్ ఇండియ పెన్సుల్వేనియా, ఈస్ట్రన్ ఇండియా రైల్వే, మద్రాసు రైల్వే, ది బొంబాయి బరోడా రైల్వే, సెంట్రల్ ఇండియా రైల్వే కంపెనీలు.
Discussion about this post