మధ్యప్రదేశ్లోని ఛింద్వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్ ఇండియన్ టాటా 84 ఏళ్ల వయసులో ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. చదువుకు వయసుతో సంబంధం లేదని భావించానని…. అందుకే నేను మొదట మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డు నుంచి ఐదో తరగతి పరీక్షలు రాశానని…. ఇప్పుడు ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నానని ప్రకాశ్ ఇండియన్ టాటా చెప్పారు. ఆ తర్వాత 10, ఇంటర్ కూడా పూర్తి చేస్తానని అన్నారు. ఆయుర్వేద వైద్యంలో మంచి పట్టు సంపాదించిన ఆయన.. సామాన్యుల నుంచి అమితాబ్ బచ్చన్ తదితర సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులు, అనేక దేశాల వ్యాపారవేత్తలకు సేవలు అందించారు. మొత్తం 112 దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు చికిత్స చేశారు.
చదువుకోవాలన్న తపన ఉండాలే కానీ అది వయసుకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించాడో వృద్ధుడు. 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాసి రికార్డులకెక్కాడు. మధ్యప్రదేశ్లోని చింద్వాడాకు చెందిన ప్రకాశ్ ఇండియన్ టాటా ఆయుర్వేద వైద్యుడు. విద్యాజ్ఞానం అస్సలు లేకపోవడంతో తొలుత మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డు నుంచి ఐదో తరగతి పరీక్షలు రాశారు. ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.
Discussion about this post