ఐపీఎల్‌లో నాలుగోసారి కోల్‌కతా ఫైనల్‌కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. బౌలింగ్, బ్యాటింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 పరుగులు చెయ్యగా… మరోవైపు వెంకటేశ్ అయ్యర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 97 పరుగులు జోడించారు.
డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను డకౌట్ చేసిన మిచెల్ స్టార్క్ హైదరాబాద్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. కీలకమైన మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గానూ నిలిచాడు. ఈ సందర్భంగా స్టార్క్ మాట్లాడుతూ.. టీ20ల్లో పవర్ ప్లే అత్యంత కీలకమని మాకు తెలుసు. ఇరు జట్లూ తొలి ఆరు ఓవర్లలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాయి. కానీ, మేం త్వరగా వికెట్లు తీయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌పై ఒత్తిడి పెరిగింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడును చూశాం. లైన్ అండ్ లెంగ్త్‌తోపాటు బంతిని స్వింగ్ చేస్తే వారిని కట్టడి చేయొచ్చని భావించాం. అందుకు తగ్గట్టుగానే బంతులేశాం. హెడ్‌ను త్వరగా ఔట్ చేయగలిగాం. ప్రతిసారి ఇలా చేయడం కష్టమే. కానీ, ప్రయత్నిస్తే ఫలితం వస్తుంది. ఇప్పటికీ మా జట్టులో చాలామంది అద్భుతమైన నైపుణ్యం కలిగిన బౌలర్లు ఉన్నారు. వారికి ఇంకా అవకాశం రాలేదు అని స్టార్క్ వెల్లడించాడు.
కోల్‌కతా టీములో ప్రతి ఒక్కరూ బాధ్యతలను స్వీకరించి మరీ విజయం కోసం కష్టపడ్డారు. మ్యాచ్ తరువాత శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ..దాదాపు పది రోజుల తర్వాత మేం మ్యాచ్ ఆడాం. గత రెండు కూడా వర్షం కారణంగా రద్దయ్యాయి.
మ్యాచ్‌ల కోసం విభిన్న ప్రాంతాలకు తిరుగుతూ.. ఆడటం అంత సులువేం కాదు. మాకు ఈ మ్యాచ్ ఫలితం అత్యంత విలువైంది. ఇప్పుడు ఏం చేయగలం అనేదానిపై దృష్టిసారించి ఆడాం.
వచ్చిన ప్రతి ఛాన్స్‌ను అందిపుచ్చుకోవడానికే ప్రయత్నించామని, బౌలింగ్‌లో వైవిధ్యం చూపిస్తే ఫలితం సానుకూలంగా వస్తుందనేదానికి ఇదొక నిదర్శనమని అన్నాడు.
Discussion about this post