నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ న పరిశీలించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనాలని చూస్తున్నారని వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నా తాము తీసుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరని చెప్పారు.






















Discussion about this post