ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాయి. కూటమి పార్టీల మ్యానిఫెస్టో విడుదల అనంతరం అభ్యర్థుల్లో ఉత్సాహం మరింతగా కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఆ పార్టీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనసేనాని ప్రత్యేఖంగా ఏర్పాటు చేసుకున్న ప్రచారం వాహనం వారాహి యలమంచిలిలోని అచ్యుతాపురానికి చేరుకోవడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చందు అందిస్తారు.
Discussion about this post