తెలంగాణ వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి. నేటి నుంచి దాదాపు పది రోజుల పాటు మూసి వేస్తున్నట్లు యాజమాన్యాలు పేర్కొన్నాయి. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రెండు నెలలుగా కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కనీసం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రోజుకు వందమంది కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో కరెంట్ ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదని ఆవేదన చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు 10 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించుకున్నారు.
Discussion about this post