ఐపీఎల్-17లో ఇప్పటికే నిబంధనల రూపంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమైంది. హిమచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగే ఓ రెండు ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్‌లు ఉపయోగించబోతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో 200పైన స్కోర్లు తరచూ నమోదవుతున్నాయి. 200+ లక్ష్యం కూడా నిలవట్లేదు. ఈ పరిస్థితుల్లో బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించాలన్న ఉద్దేశంతో ఈ హైబ్రిడ్ పిచ్‌లను రూపొందిస్తున్నారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వచ్చే ఫలితాలను బట్టి మున్ముందు మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి ట్రాక్‌లనే వాడే అవకాశాలు ఉన్నాయి.
Discussion about this post