ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఓటమి తమ జట్టుకు ఓ గుణపాఠమని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై స్కోరింగ్ గేమ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను ఓడించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి గెలుపొందింది. జానీ బెయిర్ స్టో 48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 పరుగుల అజేయ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54 పరుగులు, శషాంక్ సింగ్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 పరుగుల హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమి చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు. 262 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోకపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఎక్కడ తప్పు చేశామో కూడా అర్థం కావడం లేదని అయ్యర్ చెప్పాడు. డ్రాయింగ్ బోర్డ్‌పైనే తప్పిదాలు తెలుసుకోవాలి. ఈ పరాజయం మాకు ఓ గుణపాఠం. మేం పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు వ్యూహాలు రచించాల్సి ఉంది అని కలకత్తా కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post