అగ్రదేశాల్లో అతి కచ్చితత్వంతో రోబో శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. భారత్ లో ఎక్స్ పీరియన్సడ్ అండ్ ఎక్స్ పర్ట్ డాక్టర్లు ఉన్నప్పటికీ శస్త్రచికిత్సలు చేసే రోబోల వినియోగంలో మాత్రం వెనుకబడి ఉందనే చెప్పవచ్చు. అయితే హైదరాబాద్ లోని ప్రీతి యూరాలజీ ఆసుపత్రిలో ఏడాది బాలుడికి దేశీయంగా రూపొందించిన రోబో S S I మంత్రతో పైలో ప్లాస్టీ ఆపరేషన్ నిర్వహించి వరల్డ్ రికార్డు నెలకొల్పారు. అతిచిన్న బాలుడికి సక్సెస్ ఫుల్ గా సర్జరీ చేసిన ప్రీతి యూరాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రమోహన్ రోబోటిక్స్ అంటే ఏమిటి ? ఎలా ఆపరేషన్ చేస్తారో తెలుసుకుందాం..
వాస్తవానికి 20 ఏళ్ల నుంచి అభివృద్ది చెందిన దేశాలు రోబోటిక్స్ తో సర్జరీలు చేస్తున్నాయి. 2019 జూలైలో మనదేశంలో 66 సెంటర్లు మాత్రమే రోబోటిక్స్ ను నెలకొల్పారు. ప్రస్తుతం దేశంలో 500 శిక్షణ పొందిన సర్జన్లు మాత్రమే మనకున్నారు. రానున్న 12 ఏళ్లలో సుమారు 12వేల 800 మంది రోబోటిక్స్ తో ఆపరేషన్లు చేయడానికి రెడీ అవుతున్నారు. సర్జికల్ రోబోల వినియోగం ప్రపంచవ్యాప్తంగా శస్త్రచికిత్సలలో అత్యంత సురక్షితమైనదిగా నిరూపితమైంది. మన దేశంలోనూ వైద్య సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. అందులోభాగంగానే డాక్టర్ సుధీర్ ప్రేమ్ శ్రీవాత్సవ కొందరు యువ భారతీయ ఇంజనీర్లు కలిసి ఎస్ఎస్ఐ మంత్ర అనే పూర్తి స్వదేశీ సర్జికల్ రోబోను రూపొందించారు.
Discussion about this post