కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఆమె చేత ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా… తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా ఎంపిక అయ్యారు. నిన్నటితో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. . సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12 మంది ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు. ఆయన ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Discussion about this post