ఆకాశంలో చంద్రుడిలా ఓ ఆకారం దర్శనమిస్తోంది. మిలమిలా మెరుస్తూ వేగంగా ప్రయాణిస్తూ వెళుతోంది. కొందరు ఆ అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించి నెట్టింట పంచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరికొందరు భూమిపైకి దూసుకొచ్చి పడిపోతుందేమోనని భయపడుతున్నారు. అసలు ఆ మెరిసే నక్షత్రపు ఆకారం ఏంటి.. ఎక్కడి నుంచి వచ్చింది… ఎవరు పంపారు.. ఎన్ని రోజులుంటుంది…
కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చెన్నై వాసులను కనువిందు చేసింది. నిశీధిలో మిలమిలా మెరుస్తూ కన్పించడంతో ప్రజలు ఆశ్చర్యపడ్డారు. అదేంటో కాదు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. మే 8 నుంచి 23వ తేదీ మధ్యలో భారత్‌లోని పలు నగరాల ప్రజలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుంచి కన్పిస్తుందని ఇటీవల నాసా వెల్లడించింది. ప్రస్తుతం సూర్యుడి కాంతి దీని మీద ప్రతిబింబించడంతో ఈ స్పేస్ స్టేషన్ భారత వాసులకు కన్పిస్తోంది. సాధారణంగా చంద్రుడు కూడా మనకు ఇలాగే కన్పిస్తాడు. అయితే, జాబిల్లి అంత ప్రకాశవంతంగా ఉండకపోవడంతో పగటిపూట అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై నుంచి మనం గుర్తించలేం. అదే రాత్రివేళల్లో అయితే మెరుస్తూ కన్పిస్తుంది. కొన్ని వారాల పాటు ఇది పలు నగరాల్లో దర్శనమివ్వనుంది.
పలు సమయాల్లో మళ్లీ ఈ స్పేస్ స్టేషన్‌ను చూడొచ్చని అంతరిక్ష రంగ నిపుణులు చెబుతున్నారు. ముంబయి, దిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ దృశ్యం కన్పించనుంది. ఆకాశంలో మెరిసే వస్తువుల్లో మూడో అతిపెద్దది ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే. ఇది మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మిత ఉపగ్రహం. భూమికి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఇది భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 93 నిమిషాలు పడుతుంది. అంటే రోజుకు 15.5 సార్లు భూమిని చుట్టేస్తుంది. అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తుంటాయి. అనేక మంది శాస్త్రవేత్తలు భూమి నుంచి వెళ్లి కొన్ని నెలల పాటు ఇందులో పరిశోధనలు సాగిస్తుంటారు.
మైక్రోగ్రావిటీ మరియు అంతరిక్ష పర్యావరణ ప్రయోగాలు చేయడం దీని ప్రాథమిక ఉద్దేశ్యం. ISS సగటున 400 కిలోమీటర్లు ఎత్తుతో ఒక కక్ష్యను నిర్వహిస్తుంది మరియు రోజుకు 15.5 కక్ష్యలను పూర్తి చేస్తూ దాదాపు 93 నిమిషాలలో భూమిని చుట్టుముడుతుంది. మొదటి ISS మాడ్యూల్ 1998లో ప్రారంభించబడింది. మార్చి 2024 నాటికి , 22 దేశాల నుండి 279 మంది వ్యక్తులు అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఈ ఐఎస్ఎస్ ఎన్నో ఉపయోగాలున్నాయి.. పరీక్షల నిమిత్తం పంపిన ఏమైనా శాటిలైట్స్‌ను గుర్తించడానికి కూడా వీలవుతుంది. అంతేకాదు భూమిపైకి వచ్చే శకలాలను కూడా కనిపెడుతుంది.
Discussion about this post