ఐపీఎల్ 2024 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో జోరు కనబర్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. ఆర్‌సీబీ చేతిలో 35, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 75 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతున్న సమయంలో సన్‌రైజర్స్ ఓటములు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన బ్యాటింగ్‌తో రికార్డుల మోత మోగించింది. 200+ స్కోర్లు నాలుగు సార్లు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. ఆర్‌సీబీపై 287 పరుగులు రికార్డ్ స్కోర్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఛేజింగ్‌లో మాత్రం 207, 213 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోతుంది. ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సార్లు ఛేజింగ్ చేయలేకపోయింది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 208 పరుగుల లక్ష్యాన్ని 4 పరుగుల దూరంలో అందుకోలేకపోయింది. ఆర్‌సీబీతో రెండో మ్యాచ్‌లో 207 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక 35 పరుగులకే చిత్తయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 212 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 78 పరుగులతో చిత్తయ్యింది. ముందుగా బౌలింగ్ చేసినప్పుడు బౌలర్లు ప్రత్యర్థులను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయలేకపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాటర్లు కొండంత లక్ష్యాలు నమోదు చేస్తుండటంతో స్వేచ్చగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాటర్లతో పాటు బౌలర్లు రాణిస్తేనే సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల బాట పట్టనుంది.
Discussion about this post