T20 ప్రపంచ కప్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. IPL 2024 ముగిసిన 5 రోజుల తర్వాత నుండి ఈ పొట్టి ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరుగుతున్న ఈ టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటుండడంతో…లీగ్‌లో ఉత్కంఠ పెరిగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే విడుదల చెయ్యగా…. దీని ప్రకారం జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ జూన్ 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది.
T20 ప్రపంచ కప్ టోర్నమెంటులో భాగంగా జూన్ 26, 27 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. తాజాగా వీటి షెడ్యూల్ విషయంలో ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. T20 ప్రపంచ కప్‌లో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ 4 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా… దీన్ని 8 గంటలకు షెడ్యూల్ చేయబడింది. అంటే అదనంగా మరో 4 గంటల వ్యవధిని పొడిగించారు. అంటే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్‌డ్ డే లేదన్న మాట. దీనికి బదులు మ్యాచ్ షెడ్యూల్ చేయబడిన రోజునే మ్యాచ్‌ని పూర్తి చేయాలని ఐసీసీ యోచిస్తోంది. పైన పేర్కొన్న విధంగా, రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే.. అంటే జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగడమే ఇందుకు కారణం.
మొదటి సెమీ ఫైనల్ జూన్ 26న ట్రినిడాడ్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో వర్షం కురిస్తే ఐసీసీ ఈ మ్యాచ్‌కి రిజర్వ్ డే ఉంచింది. ఒకవేళ అనుకున్న తేదీన వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే జూన్ 27న మ్యాచ్ జరగనుంది. రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ జూన్ 27న గయానాలో జరుగుతుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ అదే రోజున ముగియాలి. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే ఈ టీ20 మ్యాచ్ నిడివి ఎనిమిది గంటలు అవుతుంది. కాబట్టి రిజర్వ్ డే అవసరం లేదంటోంది ఐసీసీ.
ఈ ప్రపంచకప్‌లో భారత్ గ్రూప్-ఎలో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్, నెదర్లాండ్స్, కెనడా, అమెరికా జట్లు ఉన్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న పాకిస్థాన్‌తో భారత్ హై ఓల్టేజీ మ్యాచ్ ఆడనుంది.
Discussion about this post